HomeతెలంగాణTelangana rural urban financial assistance scheme: ఊరికి రూ.10 వేలు.. పట్టణానికి రూ.2 లక్షలు.....

Telangana rural urban financial assistance scheme: ఊరికి రూ.10 వేలు.. పట్టణానికి రూ.2 లక్షలు.. ఇక నిధులే నిధులు

Telangana rural urban financial assistance scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. కార్యక్రమం ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో కార్యక్రమం అమలులో స్తబ్ధత నెలకొంది. దీంతో రేవంత్‌ సర్కార్‌ కార్యక్రమ నిర్వహణకు తాజాగా నిధులు మంజూరు చేసింది. గ్రామ పంచాయతీకి రూ.10 వేలు, మున్సిపాలిటీలకు రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు రూ.7.11 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఇక ప్రణాళిక ఊపందుకోనుంది. గ్రామసభలు, ప్రజా సమావేశాల ద్వారా స్థానికుల సూచనలతో రూపొందించిన ఈ ప్రణాళిక, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అమలు చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. కార్యక్రమం ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో కార్యక్రమం అమలులో స్తబ్ధత నెలకొంది. దీంతో రేవంత్‌ సర్కార్‌ కార్యక్రమ నిర్వహణకు తాజాగా నిధులు మంజూరు చేసింది. గ్రామ పంచాయతీకి రూ.10 వేలు, మున్సిపాలిటీలకు రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు రూ.7.11 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఇక ప్రణాళిక ఊపందుకోనుంది. గ్రామసభలు, ప్రజా సమావేశాల ద్వారా స్థానికుల సూచనలతో రూపొందించిన ఈ ప్రణాళిక, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అమలు చేయనున్నారు.

కేటాయింపులు ఇలా..
ప్రణాళిక ప్రకారం నిధులు ఈ విధంగా మంజూరయ్యాయి. ప్రతీ గ్రామపంచాయతీకి రూ.10 వేలు కేటాయించారు. దీంతో స్థానికంగా చిన్నచిన్న కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మున్సిపాలిటీలకు రూ.2 లక్షలు కేటాయించింది. ఇక నియోజకవర్గానికి రూ.10 లక్షలు కేటాయించారు. జిల్లాకు రూ.50 లక్షల చొప్పున విడుదలయ్యాయి.

చేపట్టే కార్యక్రమాలు ఇవీ..
ప్రభుత్వం కేటాయించిన నిధులతో వ్యాక్సినేషన్‌ క్యాంపులు నిర్వహిస్తారు. పారిశుధ్య పనులు చేపడతారు. సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు క్లియర్‌ చేస్తారు. విద్య, నీటి సరఫరా, మహిళా సాధికారత, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ నేతలు వీరే.. దేశాన్ని లీడ్ చేస్తున్నారు

ప్రజాభాగస్వామ్యం ద్వారా రూపొందిన ప్రణాళిక ఫలితంగా అమలు విజయవంతమవుతుంది. మున్సిపాలిటీలకు 20 రెట్లు ఎక్కువ నిధులు కేటాయించడం పట్టణ–గ్రామీణ అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు వేగంగా సాధించబడతాయి. ప్రభుత్వం రెండో దశలో నిధులు పెంచే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర పాలనా మోడల్‌ను మారుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version