Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 11 days Collections: 'ఉస్తాద్ భగత్ సింగ్' 11 రోజుల వరల్డ్...

Ustaad Bhagat Singh 11 days Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎట్టకేలకు పరువు కాపాడింది..

Ustaad Bhagat Singh 11 days Collections: ప్రతీ హీరో కెరీర్ లోను ఘోరమైన అవమానానికి గురి చేసే ఫ్లాప్ సినిమాలు కొన్ని ఉంటాయి. ఎలాంటి ఫ్లాప్స్ అంటే, ఆ సినిమాల పేర్లు ఎత్తితే అభిమానులకు వెన్నులో వణుకు పుట్టే రేంజ్ అన్నమాట. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అలాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు లేవు, ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వస్తాయి అనేది ట్రేడ్ లో బలంగా ఉన్న ముద్ర. కానీ పవన్ కళ్యాణ్ కి కూడా అలాంటి ఘోరమైన ఫ్లాప్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమే అని నిరూపించేలా చేసింది ఆయన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో కనీస స్థాయి అంచనాలు ఉంటాయి.

కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయ్యింది. విడుదలకు ముందు నుండే 2010 కాలం నాటి రొటీన్ కమర్షియల్ సినిమాలాగా అనిపిస్తోంది, ఈ పాన్ ఇండియా యుగం లో ఇలాంటి సినిమాలు హిట్ అవ్వడం కష్టమే అని అంతా అనుకున్నారు. అందరూ ఊహించిందే చివరికు జరిగింది. సినిమా ఒక ఫ్లో లేకుండా, ఎటు నుండి మొదలై ఎటు వెళ్తుందో అర్థం కాక, అభిమానులకు, ప్రేక్షకులకు మెంటలెక్కిపోయేలా చేసింది ఈ చిత్రం. ఫలితంగా మొదటి రోజే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అవలీలగా అందుకునే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కి, క్లోజింగ్ లో కూడా వంద కోట్ల గ్రాస్ కష్టమేమో అని అనిపించేలా చేసింది ఈ చిత్రం. ఇలా జరిగితే పవన్ కళ్యాణ్ పరువు మొత్తాన్ని గంగపాలు చేసినట్టు అవుతుంది అని అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఈ చిత్రం మరో రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది.

Also Read: ఆ దర్శకుల మధ్య గొడవలు జరగడానికి కారణం ఇదే..

గడిచిన మూడు రోజుల్లో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం నిన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా మొన్న కూడా ఈ చిత్రానికి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి, ఈ వారం లోనే 100 కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ చిత్రం అందుకోనుంది. 5 నెలల క్రితమే ఓజీ చిత్ర తో మొదటి రోజే 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన పవర్ స్టార్ లాంటి సూపర్ స్టార్ కి ఎలాంటి గతి పట్టిందో చూడండి. ఇది ఆయనకు ఒక వార్నింగ్ బెల్ లాంటిది. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవుట్ డేటెడ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే ఇంకా దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version