Peddi movie release postponed: మన టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత , సినిమాలను చెక్కే అలవాటు ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా సుకుమార్ ఉంటాడు. ఈయన అంత తేలికగా ఒక సన్నివేశానికి సంతృప్తి చెందడు, నాలుగైదు వెర్షన్స్ తీస్తాడు. ‘పుష్ప 2 ‘ షూటింగ్ ని ఇలాగే చేసి, తన సమయాన్ని వృధా చేస్తున్నాడని అప్పట్లో అల్లు అర్జున్ అలిగి విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ నిర్మాతలు వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిపి ఆయన్ని షూటింగ్ కి తీసుకొని రావాల్సి వచ్చింది. కేవలం సుకుమార్ ఒక్కడే కాదు, ఆయన శిష్యులకు కూడా ఇదే అలవాటు చేసాడు. వారిలో మనం ముందుగా బుచ్చి బాబు గురించి మాట్లాడుకోవాలి. ఈయన ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 27 న రామ్ చరణ్(Global Star Ram Charan) పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యాల్సిన ఈ సినిమాని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా అధికారికంగా మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. కారణం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పనులు ఇంకా పూర్తి అవ్వలేదట, ఏప్రిల్ నెలలో అది పూర్తి అయ్యే అవకాశాలు అసలు లేవట. ఇప్పుడు ఈ చిత్రాన్ని మే 21 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. బలంగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమా మే నెలలో కూడా విడుదల అవ్వడం అసాధ్యం అని తెలుస్తోంది. జూన్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఏప్రిల్ మొదటి వారం లో ఈ చిత్రం కొత్త విడుదల తేదికి సంబంధించిన అప్డేట్ అధికారికంగా రానుంది. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని రామ్ చరణ్ పుట్టినరోజు నాడు మార్చ్ 27 న ప్రారంభించాలని అనుకున్నారట.
కానీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ కి ఫోన్ చేసి కొన్ని రోజులు వాయిదా వెయ్యమని చెప్పారట. అప్పుడే అందరికీ అర్థం అయిపోయింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడబోతోంది అని. అనుకున్నట్టుగానే ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమాకు విడుదలకు ముందు భారీ బజ్ ఏర్పడింది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా మంచి ఊపు మీదున్న సమయం లో ఈ చిత్రాన్ని వాయిదా వేయడం చాలా పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ స్టామినా సగానికి పైగా తగ్గిపోయింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.