Telangana Emotional Story: అచ్చోసిన ఆంబోతు.. ఈ మాట తరచూ వాడుతుంటాం. ఏ పనీ పాట లేకుండా.. బలాదూర్ గా తిరుగుతూ ఉండేవారిని పెద్దవాళ్లు ఇలా సంబోధించి మందలిస్తుంటారు. మరి ఆంబోతుతో ఎందుకు పోల్చారో తెలియదు కానీ.. ఓ ఆంబోతు మాత్రం మనిషికి మించి మానవత్వాన్ని చాటుకుంది. తనను పశువు అంటారు కానీ.. ప్రేమను పంచడంలో మనిషికి తక్కువ కాను అని నిరూపించింది. తన యజమానిపై తనకున్న ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని చాటి చెప్పింది.
Also Read: చంద్రబాబుకు రూ.కోటి రాఖీ కట్టిన మహిళా నేత.. నిజం ఎంత?!
కడసారి వీడ్కోలు..
సాధారణంగా మనుషులు చనిపోతే బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవారు కడసారి చూపునకు వస్తుంటారు. అది ఎక్కడైనా సహజం కూడా. కానీ ఓ వ్యక్తి చనిపోతే ఒక ఆంబోతు వచ్చి మృతదేహం పక్కనే కూర్చుని బంధువుల చుట్టూ దీనంగా చూస్తూ కనిపించడం విశేషం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మీగడం పహాడ్ తాండాలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రూపావత్ చిన్ని నాయక్ అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. అదే రోజు రాత్రి ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. ఇంటి వరండాలో మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచారు. అయితే ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తులందరికంటే ముందే ఇంటి వరండాలో పెట్టిన మృతదేహం వద్దకు ఓ ఆంబోతు చేరుకోవడం విశేషం. ఆ మృతదేహాన్ని దీనంగా చూస్తూ అక్కడే నిలబడి ఉంది. అయితే సాధారణంగా ఆంబోతు పెద్దదిగా ఉండడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తరిమే ప్రయత్నం చేశారు. కానీ రెండు గంటలపాటు అక్కడే ఉండిపోయింది ఆ ఆంబోతు. చివరకు కర్రలతో బలంగా అదమడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
Also Read: దటీజ్ లోకేష్.. ఢిల్లీ వర్గాల్లో ఆసక్తికర చర్చ!
సాధారణ రైతు కావడంతో..
అయితే ఆంబోతు మృతదేహాన్ని పరామర్శించడం వెనుక అనేక రకాల చర్చ నడుస్తోంది. మృతి చెందిన చిన్న నాయక్ తనకున్న మూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. వివాదరహితుడు ఆపై మృదుస్వభావి. నిత్యం పూజలు చేస్తుంటాడు. దేవాలయాలకు వెళ్తుంటాడు. అందుకే ఆంబోతును ఆ దేవుడే పంపించాడు అంటూ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.