Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు, ఇలా సినిమా వ్యాపారానికి ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరు ఇప్పుడు ఓజీ చిత్రం గురించి ఎంతో ఆతృతగా, ఆశతో ఎదురు చూస్తున్నారు. కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం సంక్షోభం లో ఉంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో 20 శాతం సక్సెస్ రేట్ ఉంటే, 80 శాతం వరకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎంతో భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు పెద్ద ఫ్లాప్ అవ్వడం తో బయ్యర్స్ చేతిలో పాపం డబ్బులు రొటేషన్ లో లేకుండా పోయింది. అసలే వెంటిలేటర్ మీద నడుస్తున్న సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి అయితే దారుణం గా ఉంది. ఇప్పుడు అన్నీ లైన్ లోకి రావాలంటే, అది పవన్ కళ్యాణ్ ఓజీ(They Call Him OG) చిత్రం తోనే సాధ్యం అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రం పై క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయిల అమ్ముడుపోయాయని టాక్. అంతటి బిజినెస్ జరగడానికి ముఖ్య కారణం, పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు, ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్స్. రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని సార్లు చూసినా తనివి తీరడం లేదంటూ ఈ గ్లింప్స్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట పెద్ద హిట్ అయ్యి, ఈ చిత్రం పై అంచనాలను పదింతలు రెట్టింపు చేసింది. అయితే డైరెక్టర్ సుజిత్ తో పాటు మూవీ టీం లో ఒక చిన్న భయం మొదలైందట.
అదేమిటంటే ఈ సినిమా పై అభిమానుల్లో హద్దులు దాటిన అంచనాలు ఉండడమే కారణమని అంటున్నారు. ఓజీ సినిమా అంటే విచ్చలవిడిగా కేవలం వయొలెన్స్ మాత్రమే ఉంటుందని అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఫక్తు యాక్షన్ కమర్షియల్ చిత్రమని మూవీ యూనిట్ అభిప్రాయ పడుతుందట. అందుకే కంటెంట్ ని సాధ్యమైనంత వరకు తక్కువనే విడుదల చెయ్యాలని చూస్తున్నారట. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన ‘కూలీ’ చిత్రాన్ని ‘ఓజీ’ టీం బాగా స్టడీ చేసిందట. ఈ సినిమా మీద హద్దులు దాటిన అంచనాలు ఉండడం వల్లే, సినిమా బాగున్నప్పటికీ కూడా డివైడ్ టాక్ వచ్చిందని, ఓజీ కి అలా జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునే ప్రక్రియ ఇప్పటి నుండే మొదలైందని అంటున్నారు. అందులో భాగంగా ఈ ట్రైలర్ ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు నిమిషాల నిడివి కి పైగా ఉన్న ఒక అద్భుతమైన యాక్షన్ టీజర్ కట్ ని వదలబోతున్నారట. దీనినే ట్రైలర్ లాగా భావించాలని మూవీ టీం కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది, త్వరలోనే ఈ సినిమా నుండి రెండవ పాట విడుదల కానుంది, ఇది మెలోడీ సాంగ్, ప్రోమో నేడు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.