HomeతెలంగాణTelangana Assembly Election : తెలంగాణ ఎన్నికలకు వీలైంది.. తేదీ ఎప్పుడంటే..

Telangana Assembly Election : తెలంగాణ ఎన్నికలకు వీలైంది.. తేదీ ఎప్పుడంటే..

Telangana Assembly Election : తెలంగాణలో అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది చివరన ముగియనుంది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. ఈవీఎంల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబరులో నోటిఫికేషన్ వెలువడనున్నట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నవంబరు 12న ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిసింది.
ఏర్పాట్లలో ఎన్నికల సంఘం..
తెలంగాణ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను ఈసీ పూర్తిచేసినట్టు తెలిసింది. ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అడిగి తెలుసుకుంటోంది. సిబ్బంది సర్దుబాటు, ఈవీఎంల వినియోగం తదితర అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత రావడంతో నవంబరులో నోటిఫికేషన్‌ విడుదల అనంతరం డిసెంబరులో ఎన్నికలు జరిపేందుకు కమిషన్‌ రంగం సిద్ధం చేస్తోంది.
7న ఎన్నికలు.. 11న ఫలితాలు..
అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరు 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ముహూర్తం నిర్ణయించినట్లు తెలిసింది. ఫలితాలను 11న ఫలితాలు విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణతో పాటు రాజస్థాన్ , మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ కు సంబంధించి మాత్రమే లీకులు వస్తున్నాయి.
ప్రభుత్వానికి పక్కా సమాచారం.. 
అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్, ఎన్నికల తేదీపై ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ తెలంగాణకు మిగతా రాష్ట్రాలతో కలిపి కాకుండా ప్రత్యేకంగా నిర్వహించాలని కేంద్రం పెద్దలను కోరినట్లు తెలిసింది. కేంద్రం పెద్దలతో కుదిరిన అవగాహన మేరకే తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ విభాగాల్లో బదిలీలు చేపట్టింది.
నాడు కూడా నవంబర్‌లోనే.. 
తెలంగాణలో 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కూడా కమిషన్ నవంబరులోనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్, నవంబరు 12న నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబరు 7న ఎన్నికలు నిర్వహించగా, 11న ఫలితాలు ప్రకటించారు. దీంతో 2018లో మాదిరిగానే ఈ సారి కూడా అవే తేదీల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular