HomeతెలంగాణTelangana Crime News: ఈమె ఉత్తమ ఇల్లాలు.. ప్రియుడు, మొదటి భర్త కొడుకుతో కలిసి రెండో...

Telangana Crime News: ఈమె ఉత్తమ ఇల్లాలు.. ప్రియుడు, మొదటి భర్త కొడుకుతో కలిసి రెండో భర్త హతం

Telangana Crime News: దారుణాలు ఆగడం లేదు. ఘోరాలు తగ్గడం లేదు. పోలీసులు అరెస్టు చేస్తున్నప్పటికీ.. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ.. భర్తలు హతమవుతున్న తీరు తగ్గడం లేదు. రోజుకో తీరైన ఘటన వెలుగులోకి రావడం.. అది సంచలనం సృష్టించడం పరిపాటి గా మారింది.. ఏ తరహాలో అంతం చేస్తారో.. ఏ తీరుగా మట్టు పెడతారో అర్థం కాకుండా పోతోంది.. మేఘాలయ నుంచి మొదలు పెడితే నెల్లూరు దాకా ఈ దారుణాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇన్ని దారుణాలలో భర్తలు బాధిత పక్షంగా.. భార్యలు నిందితుల పక్షంగా ఉంటుండడం ఇక్కడ గమనార్హం.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని కొంపల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి దారుణమైన స్థితిలో హతమయ్యాడు.. కొంపల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు.. ఇతడికి గతంలోని వివాహం జరిగింది. రవి భార్య పేరు లక్ష్మి. లక్ష్మీ ద్వారా రవికి ఇద్దరు కుమారులు కలిగారు. లక్ష్మితో సంసారం చేసుకుంటూనే.. రేణుక అనే మహిళను రవి ప్రేమించాడు. అప్పట్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. చివరికి రేణుకను రవి వివాహం చేసుకున్నాడు. రేణుకకు అంత క్రితమే వివాహం జరిగింది. అతడి ద్వారా ఆమెకు ఒక కుమారుడు కూడా కలిగాడు.. మొదటి భర్త చనిపోవడంతో రేణుక వితంతువు గా మారింది. ఈ నేపథ్యంలో సరిగా 13 సంవత్సరాల క్రితం రేణుకను రవి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో వేరువేరుగా కాపురం పెట్టాడు. గడిచిన 13 సంవత్సరాలుగా రవి తన ఇద్దరు భార్యలు లక్ష్మి, రేణుకతో సంసారం సాగిస్తున్నాడు.

Also Read:  BRS vs Kavitha : ఏందీ ‘పంచాయితీ’ కవితక్కా!

రేణుక తన ప్రవర్తనను మార్చుకుంది. పూర్తిగా దారి తప్పింది. ఆమె శ్రీపాల్ రెడ్డి అనే సెక్యూరిటీ కార్డుతో వివాహేతర సంబంధం మొదలుపెట్టింది.. శ్రీపాల్ రెడ్డి రేణుకతో డబ్బు ఆశ చూపిస్తున్న నేపథ్యంలో.. ఆమె పూర్తిగా అతడి మైకంలో పూర్తిగా మునిగిపోయింది.. అంతేకాదు తనకు మరో జీవితాన్ని ప్రసాదించిన రెండో భర్తను కూడా పూర్తిగా మర్చిపోయింది. శ్రీపాల్ రెడ్డి సహాయంతో.. మొదటి భర్త కుమారుడు సహకారంతో అతని అంతం చేసింది.. రవి చనిపోయిన విషయం తెలియడంతో అతని మొదటి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించి.. రేణుకను, ఆమె మొదటి భర్త కుమారుడు శేఖర్, ప్రియుడు శ్రీపాల్ రెడ్డి, ఇంకా కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మొదటి భర్త చనిపోయి.. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రవి రేణుకను అక్కున చేర్చుకున్నాడు. ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించాడు. మొదటి భార్య లక్ష్మీ నుంచి ఇబ్బందులు ఎదురైనప్పటికీ తట్టుకున్నాడు. ఆమెను తనలో భాగం అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం దారి తప్పింది. తనకు జీవితాన్ని ప్రసాదించాడు అనే ఉదారత కూడా లేకుండా అతడిని అంతం చేసింది. మరో వ్యక్తి పంచన చేరి ఏ మహిళ చేయకూడని దారుణం చేసింది.. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular