Homeఎంటర్టైన్మెంట్Madhavan Latest Look: 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల లుక్, మాధవన్ గ్లామర్ సీక్రెట్...

Madhavan Latest Look: 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల లుక్, మాధవన్ గ్లామర్ సీక్రెట్ ఇదే!

Madhavan Latest Look: హీరో మాధవన్ లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. ఐదు పదుల వయసులో కూడా ఆయన సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నారు. వయసు దరి చేయని ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటనే చర్చ నడుస్తుండగా… ఆయన స్వయంగా తన యవ్వన రహస్యం బయటపెట్టారు.

Also Read: బాలయ్య-అనసూయ ‘స్క్విడ్ గేమ్’ ఆడితే..!

మిలీనియం ఆరంభంలో లవర్ బాయ్ ఇమేజ్ తో సౌత్ ఆడియన్స్ ని అలరించాడు మాధవన్. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అలై పాయుతె మాధవన్ కి బ్రేక్ ఇచ్చింది. తెలుగులో ఈ చిత్రం సఖి టైటిల్ తో విడుదలై… ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సఖి చిత్రంలోని ఏఆర్ రహమాన్ సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఒక అద్భుతమైన ప్రేమ కథను మణిరత్నం ఆవిష్కరించాడు. అలాగే చెలి చిత్రం మాధవన్ కెరీర్ ని నిలబెట్టిన చిత్రాల్లో ఒకటి.

చెలి, రన్, ఆయుధ ఇజుత్తు చిత్రాలతో మాధవన్ సౌత్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. తెలుగు ఆడియన్స్ లో కూడా మాధవన్ కి ఇమేజ్ దక్కింది. ముఖ్యంగా యూత్ ఆయన చిత్రాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే మెల్లగా మాధవన్ తెలుగు ఆడియన్స్ కి దూరం అయ్యారు. ఆయన బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో, అక్కడ చిత్రాలు చేస్తున్నారు. మాధవన్ నటించిన 3 ఇడియట్స్, తను వెడ్స్ మను మంచి విజయాలు అందుకున్నాయి.

3 ఇడియట్స్ మల్టీస్టారర్ కాగా.. అమీర్ ఖాన్ ప్రధాన హీరో రోల్ చేశాడు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన 3 ఇడియట్స్ లో మాధవన్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా 3 ఇడియట్స్ నిలిచిపోయింది. కొన్నాళ్లుగా మాధవన్ హిందీ చిత్రాలు అధికంగా చేస్తున్నారు. 2025లో ఇప్పటికే మాధవన్ నటించిన నాలుగు హిందీ చిత్రాలు విడుదల కావడం విశేషం. మాధవన్ లీడ్ రోల్ చేసిన చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

1970లో జన్మించిన మాధవన్ వయసు 55 ఏళ్ళు. అయితే ఆయన యంగ్ లుక్ లో దర్శనం ఇస్తున్నారు. వయసును దరి చేరనీయని ఈ హీరో ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటో తెలుసా? మాధవన్ ఉదయాన్నే గోల్స్ ఆడతాడట. ఉదయం ఎండలో ఆడటం వలన చర్మం ముడతలు పడదు అట. అప్పుడే వండిన పప్పు, రైస్, కూరగాయలు తింటాడట. ఫ్రై లకు, మందుకు దూరంగా ఉంటాడట. గత ఇరవై ఏళ్ల నుండి నల్ల నువ్వుల నూనె వారానికి ఒకసారి ఒంటికి పట్టిస్తాడు అట.

RELATED ARTICLES

Most Popular