BRS vs Kavitha : అయితే పార్టీలో ‘ఉండు’.. లేకుంటే బయటకు పో.. బయటకు పోయి బండ తిట్లు తిట్టేసేయ్.. కక్కేసేయ్.. అప్పుడైనా ఆ కోపం తగ్గుతుంది. కానీ బీఆర్ఎస్ తో ఉంటూనే.. నాన్న కేసీఆర్ ను దేవుడు అంటూనే.. అన్న కేటీఆర్ ను , బీఆర్ఎస్ నేతలను తిడుతూ ఇలా ఎంత కాలం అక్కా.. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్.. ఇదే తగ్గించుకోవాలి..
పోతే పోనీ పిచ్చి పదవులు.. మనకు ఏం తక్కువనా ఏందీ.. నిజామాబాద్ ఎంపీగా గెలవకుండా కుట్రలు పన్నినోళ్లే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు.. అలాంటి దాన్నే ఎదుర్కొన్నావు.. ఆఫ్ట్రాల్ ఇదంత కవితక్కా.. నిజానికి లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎంతో బాధపడ్డారు. కేటీఆర్ ఢిల్లీలో ఉండి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి.. బెయిల్ వచ్చేందుకు ఆపసోపాలు పడ్డాడు. ఎలాగోలా 3 నెలలకు బెయిల్ వచ్చి కవిత బయటకొచ్చింది. ఆ తర్వాతే సీన్ మారింది.
తప్పు కవిత చేసిందా? లేక కవితను ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేసీఆర్, కేటీఆర్ నిర్ణయించారో తెలియదు.. కానీ జైలు నుంచి బయటకొచ్చాక కవితను దూరం పెట్టారు కేసీఆర్, కేటీఆర్. ఇప్పటికే దెబ్బ తిన్న పులిలా ఉన్న కవితక్క మరింత రాజకీయం చేస్తూ కాక రేపుతోంది.
ఇలాంటి టైంలో కూతురికి చెప్పలేక.. కొడుకు కేటీఆర్ ను సముదాయించలేక కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. కవితను రాజకీయంగా సైలెంట్ గా ఉంచాలని కేటీఆర్ ప్రయత్నం కాబోలు. అందుకే ఆమె లేఖలు లీక్ అయ్యాయి.. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గిపోయింది.
అయితే కవిత సైలెంట్ ఉండే రకం కాదు.. ఏపీలో షర్మిల,, తెలంగాణలో కవిత ఫైర్ బ్రాండ్స్.. జైలుకెళ్లి వచ్చాక కవిత రెచ్చిపోతోంది.. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. దీంతో కక్కలేక మింగలేక కేసీఆర్, కేటీఆర్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. బీఆర్ఎస్ నేతలకు ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు.
అందుకే ‘కవితాస్త్రం’ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక.. ఈ ‘పంచాయితీ’ని భరిస్తూ పోవడం తప్ప బీఆర్ఎస్ పెద్దలకు ఇప్పుడు మరో ఆప్షన్ లేకుండా పోయింది.