Telangana Congress Padayatra: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పాద యాత్ర, శ్రమదానం పేరుతో పర్యటిస్తున్న సందర్భంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలలో ప్రజలతో ఈ పర్యటనలో భాగంగా మాట్లాడి, పార్టీ పరిస్థితీ, ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఫీడ్ బయటకు తీసుకుంటున్నారు. ప్రజల మనోభావాలు, వారి సమస్యలు, అందుకు ప్రతిగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె నిశితంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ఈ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీని క్రమశిక్షణలో నడుపుతున్న ఒక నాయకురాలిగా ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. జూలై 31న పరిగిలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, ఆగస్టు 3న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో ఆగస్టు 4న కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఆగస్టు 5న వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో ఆమె పర్యటిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఒక కమిటీ వేశారు. పార్టీని బలోపేతం చేసే దిశలో ఆమె చేస్తున్న పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది. ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
Also Read: సీఎం రేవంత్ కే ఎసరు పెట్టిన పంచాయితీ కార్యదర్శి?
పదవుల కోసమేనా పాదయాత్రలు..
విపక్ష నేతలు మాత్రమే పాదయాత్ర చేసి, ప్రజల్లో తాము ఉన్నామని భరోసా ఇవ్వడమే కాకుండా, ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకోవడానికి చేశారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన వారికి ప్రజలు పట్టంకట్టిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ లో చూశాం.
కానీ ఈ పాదయాత్రకు ఒక ప్రాముఖ్యత ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కేవలం పదవే పరమావిధిగా ఎప్పుడూ అదే కోణంలో ఆలోచించే నాయకులు, వారికి చెందిన చానళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఎలా ఉంది. ప్రజలు ప్రజా ప్రభుత్వ తీరుపై ఏ విధంగా స్పందిస్తున్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే విషయాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఒక శుభ పరిణామం. ఈ పాదయాత్ర మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది. కేవలం ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్ర అధికారాన్ని అందిస్తుందని అనుకోవచ్చు కానీ, ఇలాంటి సమయంలో పాదయాత్ర ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాపాలన ఎలా ఉందని ప్రజల నుంచి తీసుకునే ఫీడ్ బ్యాక్ తో పార్టీ ఎలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోవచ్చని తెలిసిపోతుంది.
అలాగే పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తుందని అనడంలో సందేహం లేదు.
Also Read: వదిలేదేలే.. టీచర్లకు చుక్కలు చూపిస్తున్న రేవంత్ సర్కార్
మొదటి రోజు పరిగి లో తేటతెల్లం
పరిగిలో 31న
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన “జనహిత పాదయాత్ర” కు విశేష స్పందన కనిపించింది. ఈ కార్యక్రమంలో
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.
అధికారంలో ఉండి పాదయాత్రలు చేయడమేంటని విమర్శిస్తున్న వారికి ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎంత వరకు చేరుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకేం చేయాలి అని ప్రజలనే అడిగి తెలుసుకోవాలనేదే తమ సంకల్పమని తేల్చి చెప్పారు. అడుగడుగున ఆమె ను ప్రజలు ఆదరిస్తున్న తీరు ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.