https://oktelugu.com/

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సీఎం!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : November 16, 2024 5:43 pm
Telangana Cabinet Expansion

Telangana Cabinet Expansion

Follow us on

Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది కావస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సీఎంగా మరో 11 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పడింది. కేబినెట్‌లో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిగా భర్తీకి నోచుకోవడం లేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత భర్తీ చేస్తారని ప్రచారం జరిగినా ఆషాఢ మాసం అడ్డు వచ్చింది. తర్వాత శ్రావణంలో భర్తీ చేస్తారని కొందరి పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయినా చడీ చప్పుడు లేదు. ఇక ఏడాది పాలన పూర్తికావొస్తున్న తాజా పరిస్థితిలో సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈమేరకు ఏఐసీసీ, సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విజయోత్సవాలు..
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల నుంచి కేబినెట్‌లో ఆరు పోస్టుల భర్తీపై చర్చలు జరుగుతున్నాయి. నాటి నుంచే ఆశావహులు నిరీక్షిస్తున్నారు.

11 నెలలుగా నిరీక్షణ..
ఇదిలా ఉంటే.. కేబినెటuŠ‡లో మిగిలిన ఆరు స్థానాల కోసం అనేక మంది ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ఏడాదిలో 24 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పలువురి పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఆశావహులు కూడా ఢిల్లీ స్థాయిలో సొంతంగా లాబీయింగ్‌ చేశారు. కొందరికి అధిష్టానం నుంచి హామీ కూడా వచ్చిందని ప్రచారం కూడా జరిగింది. టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించిన సమయంలోనూ మంత్రదివర్గ విస్తరణపై చర్చ జరిగింది. కానీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. దీంతో 11 నెలలుగా ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు.

రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత..
ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎంపికయ్యారు. నవంబర్‌ 20న ఎన్నికలు జరుగనున్నాయి. 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత తెలంగాణలో క్యాబినెట్‌ విస్తరణకు అధిష్టానం నుంచి అనుమతి వస్తుందని తెలిసింది.