https://oktelugu.com/

Tiger: జానీ మాత్రమే కాదు.. మరో పులికి కూడా తెలంగాణలో ప్రేమ కథ ఉంది..

జానీ, ఎస్ 12 పులులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవి. ఇవి తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగింది. ఆవాసం ఇరుకుగా మారింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 16, 2024 / 05:38 PM IST

    Tiger(1)

    Follow us on

    Tiger: నిన్ననే మనం చెప్పుకున్నాం కదా.. మహారాష్ట్రకు చెందిన జానీ అనే పెద్దపులి.. తెలంగాణకు వచ్చిందని.. సరైన జోడు దొరకక.. విరహవేదనతో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిందని.. అయితే జానీ మాత్రమే కాదు.. మరో పులికి కూడా తెలంగాణలో ప్రేమ కథ ఉందట. ఆ పులి పేరు ఎస్ 12(అటవీశాఖ అధికారులు పెట్టారు) . మహారాష్ట్రలోని తడోబా ప్రాంతానికి చెందింది. దాని వయసు రెండు సంవత్సరాలు. అది మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతాలలో సంచరిస్తోంది. ఇది మాత్రమే కాకుండా మరో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాలలో ఇటీవల సంచరించి వెళ్లిపోయింది..

    అందువల్లే ఇక్కడికి వస్తున్నాయట

    జానీ, ఎస్ 12 పులులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవి. ఇవి తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగింది. ఆవాసం ఇరుకుగా మారింది. అందులో ఎక్కువగా మగ పులులు మాత్రమే ఉన్నాయి. దీంతో వాటి సంభోగానికి ఇబ్బంది అవుతుంది. ఉన్న ఆడ పులుల సంఖ్య తక్కువ కావడం.. వాటితో కలవడానికి మగ పులులు పోటీ పడుతుండడంతో.. అక్కడ ఆ ఒత్తిడిని తట్టుకోలేక జాని, ఎస్ 12 పులులు కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, సారంగపూర్, కుంటాల, మామడ, పెంబి మండలాలలో సంచరిస్తున్నాయి. వాస్తవానికి ఈ పురులు కావాలి ప్రాంతంలోని కోర్ ఏరియా కు చేరుకోవాలంటే దాదాపు వందల కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అయితే పులులకు ఇది పెద్ద సమస్య కాదు. వాటి రాకకు బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, పంట పొలాలు అడ్డంకి గా మారాయి. ప్రభుత్వం అండర్ పాస్, ఓవర్ పాస్ వంటి వాటిని ఏర్పాటు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. దీంతో పురుడు అడవి అంచుల్లోనే సంచరిస్తున్నాయి. ఇది సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఇక అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం కవ్వాల్ బయట కాగజ్ నగర్ డివిజన్ ప్రాంతంలో ఐదు పెద్ద పులులు ఉన్నాయి. నాలుగు చిన్న పులులు కలిపి మొత్తం 9 ఉన్నాయి.. ఇక తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న పులులు దాడులకు పాల్పడుతున్నాయి. మనుషులు జంతువులు అని తేడా లేకుండా పంజా విసురుతున్నాయి. 2020 నవంబర్ నెలలో 18 రోజుల వ్యవధిలోనే ఏ-2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలం దిగిడ అనే గ్రామానికి చెందిన విగ్నేష్ అనే 21 సంవత్సరాల యువకుడిని చంపేసింది. పెంచికల్ పేట మండలం కొండపల్లి చెందిన 18 సంవత్సరాల నిర్మల అనే యువతిపై దాడి చేసి చంపింది. ఇక మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ ప్రాంతానికి చెందిన భీము అనే 69 సంవత్సరాల రైతుపై దాడి చేసి ప్రాణాలు తీసింది.. అయితే మగ పులులకు తగ్గట్టుగా ఆడపులులు లేకపోవడం.. వాటికి సంభోగంలో పాల్గొనే వయసు రావడంతో అవి తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాయి. విరహవేదనతో వందల కొద్ది కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాయి.. అయితే ప్రస్తుతం జానీ మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని..ఎస్ 12 మాత్రం తెలంగాణలోనే సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

    ఆహార అన్వేషణ కోసం కాదు

    మొదట్లో జానీ, ఎస్ 12 ఆహార అన్వేషణ కోసం వచ్చాయని అటవీశాఖ అధికారులు భావించారు. అయితే ఆ పులుల గమనం విచిత్రంగా ఉండడం.. వాటి చూపు, నడక పలు విధమైన సంకేతాలు ఇవ్వడం అటవీ శాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే ఇదే సమయంలో వాటికి తెలంగాణలో ఆడపులులు కనిపించడంతో వాటి వ్యవహార శైలి మారింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆ పులులు కేవలం సంభోగం కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నాయని అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే జానీ, ఎస్ 12 గమనం సాగించడం విశేషం.