https://oktelugu.com/

Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్‌ 2024–25 : మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా.. రుణ మాఫీ.. బడ్జెట్‌లో ప్రతిపాదన!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ ప్రసంగాన్ని గురువారం(జూలై 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోలిస్తే.. ఈ బడ్జెట్‌ రూ.20వేల కోట్లు పెరిగింది. గత ఫిబ్రవరిలో రూ.2.70 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాగా.. తాజాగా భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో ప్రతిపాదించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 25, 2024 / 02:47 PM IST

    Telangana Budget 2024

    Follow us on

    Telangana Budget 2024: తెలంగాణలో రాబోయే 8 నెలల కాలాని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024–25 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.20 లక్షల కోట్లు కాగా, మూల ధన వ్యయం 33,487 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ తలసరని ఆదాయం రూ.3.4 లక్షలని తెలిపారు. ఇక గత ప్రభుత్వం పనితీరు కారణంగా రాష్ట్ర అప్పులు రూ.6.71,756 కోట్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక చేసిన అప్పులు రూ.35,118 కోట్లు అని పేర్కొన్నారు. ఇక బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యం దక్కింది. వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో అత్యధికంగా రూ.72,659 కోట్లు కేటాయించారు. తర్వాత సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. తర్వాత నీటిపారుదల రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రత్యేక పథకాలు ఏమీ ప్రకటించకపోయినా.. మహిళా సంఘాల సభ్యులకు మాత్రం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.10 లక్షల వరకు బీమా కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 63.86 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని వీటిని సభ్యులకు ఈ బీమాతో లబ్ధి కలుగుతుందని తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సాయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మహిళా శక్తి పథకానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నిధులు దేనికి వెచ్చిస్తార్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.

    రూ.2 లక్షల రుణమాఫీ..
    ఇదిలా ఉంటే.. మహిళా సంఘాల సభ్యులకు ఈ బడ్జెట్‌లో ఊరట లభించింది. రూ.10 లక్షల బీమాతోపాటు.. సంఘాల్లో సభ్యులుగా ఉంటూ.. ఏదైనా కరాణంతో మరణిస్తే ఇకపై రుణం చెల్లించే అవసరం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో సభ్యురాలు మరణించినా రుణం చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై ఆ అవసరం ఉండదన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.50 కోటుల కేటాయిస్తున్నట్లు తెలిపారు.

    పాఠశాలలో పనులు..
    ఇది సమయంలో మహిళా సంఘాలక సభ్యులకు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు కూడా అప్పగించే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు పనులు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే యూనిఫాం స్టిచ్చింగ్‌ మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. ఇందుకు జతకు గతంలో రూ30గా నిర్వహించామని, తర్వాత ముఖ్యమంత్రి సూచన మేరకు స్టిచ్ఛింగ్‌ చార్జి రూ.50 పెంచి చెల్లించామన్నారు. పాఠశాలల నిర్వహణకు అమ్మ ఆదర్శ సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలల్లో పారిశుధ్య కార్మికుల కొరత ఉన్న నేపథ్యంలో ఆ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఇక మహిళల ఆర్థికాభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతీ గ్రామంలో మీసేవ కేంద్రం, మహిళా క్యాంటీ న్‌ ఏర్పాటు బాధ్యతలు అప్పగించామన్నారు. మహిళా సంఘాలకు రుణాలు కూడా విరివిగా అందిస్తున్నట్లు తెలిపారు.