spot_img
Homeజాతీయ వార్తలుZomato Delivery Boy : జొమాటో డెలివరీ బాయ్ రూమ్ టూర్.. గుండెల్ని మెలి పెడుతోంది.....

Zomato Delivery Boy : జొమాటో డెలివరీ బాయ్ రూమ్ టూర్.. గుండెల్ని మెలి పెడుతోంది.. మనసుల్ని ద్రవింపజేస్తోంది.. వీడియో వైరల్

Zomato Delivery Boy : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హోమ్ టూర్, రూమ్ టూర్ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. యూట్యూబర్లు.. పేరుపొందిన వ్యక్తులు, బాగా డబ్బున్న వారి హోమ్ టూర్లు, రూమ్ టూర్లను మాత్రమే చేస్తున్నారు.. వీక్షకులు కూడా వాటిని చూసేందుకు ఇష్టపడుతున్న నేపథ్యంలో.. ఆ కేటగిరీకి చెందిన వారి హోం టూర్లు, రూమ్ టూర్లు తెగ ప్రాచుర్యం పొందుతున్నాయి. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఓ హోమ్ టూర్ వీడియో నెట్టింట తెగ హడావిడి సృష్టిస్తోంది. వాస్తవానికి దాని హోమ్ టూర్ అనేకంటే.. రూమ్ టూర్ అనడం సబబు. పైగా ఆ రూమ్ ఇంద్ర భవనం కాదు. ఆ రూమ్ లో ఉంటున్న వ్యక్తి శ్రీమంతుడు కాదు. అయినప్పటికీ ఐదు మిలియన్ల వ్యూస్ నమోదు చేసుకుంది. నెట్టింట తెగ చర్చకు దారితీస్తోంది. ఈ రూమ్ టూర్ చూసినవారు ఆ యువకుడికి సెల్యూట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు ఇంతమందిని కదిలిస్తోంది? దాని వెనుక ఎటువంటి నేపథ్యం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ముంబై నగరంలో..

ముంబై నగరం పేరు చెబితే దేశ ఆర్థిక రాజధాని గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రాంతంలో శ్రీమంతులే కాదు.. పొట్టకూటి కోసం తిప్పలు పడే పేదలు కూడా ఉంటారు. అలాంటి పేదరిక నేపథ్యానికి చెందిన ఓ యువకుడు ముంబై నగరంలో జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. గతంలో అతడు అనారోగ్యానికి గురైనప్పుడు.. ఆ యువకుడి కుటుంబం తమ స్తోమతకు మించి ఖర్చు చేసింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చేందుకు ఆ యువకుడు ముంబై నగరానికి వచ్చేసాడు. జొమాటో డెలివరీ బాయ్ గా పనికి కుదిరాడు. అతనికి వచ్చే వేతనం లో సింహ భాగాన్ని ఇంటికి పంపిస్తున్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కుటుంబం తెచ్చిన అప్పులను తీర్చుతున్నాడు. సింహ భాగం మొత్తం ఆటే వెళ్తున్న నేపథ్యంలో.. అతని వద్ద పెద్దగా డబ్బు ఉండడం లేదు. అందువల్లే తన స్నేహితుడి రూమ్ లో ఉంటున్నాడు. ఆ రూమ్ మరీ అంత పెద్దది కాదు. స్థూలంగా చెప్పాలంటే ముంబై మహానగరంలో ఒక మురికివాడలో ఉంటుంది ఆ గది.. ఆ గదిలో ఉండేందుకు తన స్నేహితుడికి ప్రతి నెల 500 అద్దె చెల్లిస్తుంటాడు.

రూమ్ టూర్

qb _07 పేరు మీద ఉన్న ఐడీ నుంచి ఇన్ స్టా గ్రామ్ లో ఆ యువకుడు రెండు వీడియోలను పోస్ట్ చేశాడు.. వీటికి రూమ్ టూర్ అని పేరు పెట్టాడు. ఆ వీడియోలో ఆ యువకుడు ముంబై మురికివాడలో ఉన్న తన చిన్నగా అయితే వెళ్లేందుకు ఇరుకైన సందులో ప్రయాణిస్తూ కనిపించాడు.. ఆ వీడియోలో “ఈ ప్రదేశంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకునేందుకు కష్టపడుతున్నానని” ఆ యువకుడు చెబుతున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. అలా ప్రయాణించిన తర్వాత కొంతసేపటికి మురికివాడ చివరికి వచ్చిన ఆ యువకుడు తన గదిలోకి వెళ్లేందుకు ఇనుప మెట్లు ఎక్కాడు. ఇదే సమయంలో తన స్నేహితుడు సోను ను అందరికీ పరిచయం చేశాడు. ఆ గదిలో ఉన్న వస్తువులను చూపించి..”మీరు నా రూమ్ పరిస్థితిని చూడవచ్చని” వీడియోలో పేర్కొన్నాడు.. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ కోసం వెళ్లే ముందు అతడు తన స్నేహితుడితో కలిసి బిర్యానీ ఆరగించాడు.. ” నేను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో నా కుటుంబం నాకోసం చాలా ఖర్చు చేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఇంటి నుంచి డబ్బు అడగలేను” అని పేర్కొన్నాడు. మరోవైపు ఇదే జొమాటో డెలివరీ ఏజెంట్ జూలై 23న మరో వీడియో పోస్ట్ చేశాడు.”స్థలం లేకపోవడంతో నేను ఉండే గదిలో తాత్కాలిక బాత్ రూం ఏర్పాటు చేశాను.. అందువల్ల మరుగుదొడ్డి బయట ఉంది. ఈ గదిలో వెలుతురు కూడా లేదు. ఎలా ఉన్నప్పటికీ నాకు తప్పదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కృషి చేస్తానని” ఆ యువకుడు పేర్కొన్నాడు.. ఈ వీడియో మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. ఈ వీడియోని చూసిన చాలామంది.. అతడిని అభినందిస్తున్నారు. నీలాంటి వాళ్ళుంటే దేశం అన్ని రంగాలలో ముందంజ వేస్తుందని కొనియాడుతున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version