Telangana BC reservations: రేపటి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభావితం చేసే బీసీ రిజర్వేషన్ పైనే అందరి దృష్టి కేంద్రీకరించబడి ఉంది. ఈ విషయంలో ఏ పార్టీ ఏవిధంగా స్పందిస్తున్నారు అనే విషయాలపై బీసీ వర్గాలు సునిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏవిధంగా స్పందించాలని విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు ఇంకా మల్లగుల్లపడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. అయితే ఈ విషయంలో బిల్లుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అనుకూలంగా లేనట్లు కనిపిస్తున్న తరుణంలో రాష్ట్రపతి ఆమోదముద్ర కు సమయం పడే అవకాశముంది. దీంతో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసి గవర్నర్ కు పంపి తమ చిత్తశుద్ధి చాటుకున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల కు వ్యతిరేకం కాదని ఒకవైపు ప్రకటిస్తూనే, మరోవైపు ఈ
బీసీ రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినందుకు బీజేపీ అడ్డుతుగులున్నట్లు స్పష్టమౌతుంది. అయితే ఈ బిల్లు విషయంలో బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా బీజేపీ ఈ బిల్లు సమర్థించదని తెలిసి కూడా కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెట్టిందని, ఆ పార్టీకి రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ అధినాయకులు విమర్శలకు పరిమితమయ్యారు.
Also Read: కేటీఆర్, హరీష్ రావు ఏకతాటి మీదికి వచ్చారంటే.. అది కవిత పుణ్యమే!
కవితక్క రాజకీయ పరిణతి
అయితే కేసీఆర్ కూతురు కవితక్క మాత్రం ఈ బిల్లును స్వాగతిస్తూ, సంబరాలు చేసుకోవడంతో తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తన విధిని తాను నిర్వర్తించిందని, బిల్లు ను సమర్థిస్తూ ప్రకటన చేయడంలో తప్పేమీ లేదని ఆమె తన వైఖరి స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా బీసీ లకు మద్దతుగా బిల్లు ఆమోదిస్తే దాన్ని వ్యతిరేకించడం వారి నుంచి పార్టీ దూరం కావడమేనని ఆమె భావించినట్లున్నారు. అందుకే ఎలాంటి భేషజాలు లేకుండా సమర్థించారు. ఎలాగోలా ఈ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడం తెలుసుకున్న కవిత, ఈ విషయంలో పార్టీ తీసుకున్న స్టాండ్ కు వ్యతిరేకంగా స్పష్టమైన ప్రకటన చేస్తూ కేటీఆర్ కన్నా తనకు రాజకీయాలపై ఎక్కువ అవగాహన ఉందని మరోసారి చాటి చెప్పారు. కానీ ఈ విషయంలో బిఆర్ఎస్ మాత్రం ఏవిధంగా స్పందించాలని మీమాంసలో కొట్టుమిట్టాడుతునే ఉన్నారు.
కాంగ్రెస్ మరో అడుగు ముందుకు..
అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుగా మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కొంత సమయం పట్టినా, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేసేందుకు తాత్సారం చేసినా తమ పార్టీ మాత్రం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కు అనుగుణంగా బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చి రంగంలోకి దింపుతామని ఇదివరకే ప్రకటించడం బిఆర్ఎస్ నేతలకు మింగుడుపడడం లేదు. కనీసం బిల్లు విషయం పక్కనబెట్టి తమ పార్టీ కూడా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించేందుకు సైతం అధైర్యం చేయడం లేదు. ఈ విషయంలో పార్టీ జిల్లా, మండల స్థాయి బీసీ నాయకులు పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కోల్పోయి, ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేక, ఎంఎల్సీకి పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మరోవైపు ట్యాపింగ్, కార్ రేస్, కాళేశ్వరం తో పాటు మరెన్నో కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఈ సమయంలో కనీసం కిందిస్తాయి కేడర్ ను నిలుపుకునేందుకు అవకాశమున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో త అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నాల్లో భాగంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటున్నారు. కానీ ప్రధానమైన బీసీ నినాదం స్తానిక ఎన్నికలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయంలో తాము పార్టీ పరంగా 42 శాతం లేక ఇంకా ఎక్కువగా రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ప్రకించే విషయంలో ఆ పార్టీ నేతలు సంశయిస్తున్నారు. బీసీ లను మోసం చేసేందుకు కాంగ్రెస్ బీసీ బిల్లు, ఆర్డినెన్స్ చేస్తున్నారని విమర్శలకే పరిమితమవుతున్నారు.
Also Read: కేటీఆర్ బుల్లెట్ ఎదురుతిరిగిందా..?
నామినేటెడ్ లో కూడా బీసీ లకు పెద్దపేట
నామినేటెడ్ పదవుల్లో కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే బీసీ నాయకులకు పెద్దపీట వేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓసీ స్థానాలకు కేటాయించిన నామినేటెడ్ పదవులను బీసీ లకు కేటాయించే విషయంలో ముందుచూపు ప్రదర్శించింది. రాష్ట్రంలో నిర్ణయాత్మకమైన ఓటు కలిగి ఉన్న బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఇంటిపోరుతో ఇబ్బందులు పడుతున్న బిఆర్ఎస్ భవితవ్యంపై ఆ పార్టీలోని నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.