Nimisha Priya Case Update: కేరళలో పుట్టి.. యెమెన్ దేశంలో నర్స్ గా చేస్తూ.. ఆసుపత్రి నిర్వహిస్తున్న నిమిష ప్రియ ఓ హత్య కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆమె ప్రమేయంతో ఓ వ్యక్తి కన్నుమూశాడు. ఎడారి దేశానికి చెందిన ఆ వ్యక్తి భాగస్వామ్యంతో నిమిష అక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేసింది.. మొదట్లో ఆసుపత్రి సజావుగానే సాగేది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో దీనిని నిమిష ప్రియ అంతగా ప్రతిఘటించలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ అతడి ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిమిషప్రియ తట్టుకోలేకపోయింది. అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేకపోవడంతో.. మత్తు ప్రయోగం ద్వారా అతడిని అంతం చేసింది. ఈ కేసులో బలమైన ఆధారాలు అక్కడి పోలీసులకు లభించడంతో నిమిషప్రియ పై అభియోగాలు మోపారు. పైగా అక్కడ షరియా చట్టం అమల్లో ఉంటుంది. దీంతో అక్కడ న్యాయస్థానాలు కూడా ఆ చట్టాలకు అనుగుణంగానే తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా తమ దేశ పౌరుడు ని అత్యంత కిరాతకంగా చంపిన నేపథ్యంలో నిమిషప్రియకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
ఇక అప్పటినుంచి నిమిషప్రియను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అక్కడ దేశంలో అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. అక్కడి పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేవు. ఫలితంగా అక్కడి మన దౌత్య కార్యాలయాన్ని వేరే దేశం నుంచి కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ మన దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రకరకాల విధాలుగా మృతుడి కుటుంబాన్ని క్షమాభిక్ష పెట్టాలని కోరుతూనే ఉంది. నిమిషప్రియను కాపాడేందుకు ఆమె కోసం ఒక సంస్థ కూడా ఏర్పాటయింది. ఆమె తరఫున ఒక వ్యక్తి అక్కడి ప్రభుత్వంతో, కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించాడు. వాస్తవానికి ఇటీవల ఆమెను ఉరితీయాల్సి ఉన్నప్పటికీ.. అనేక రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు.. అయితే నిమిష ప్రియ మరణశిక్ష కేసులో మంగళవారం ఉదయం ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రభుత్వం ఆమెకు మన శిక్షను రద్దు చేసినట్టు భారత గ్రాండ్ మస్తీ కాంతపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఆ దేశానికి చెందిన విద్యావేత్తలు, దౌత్య వేత్తలు.. ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారికంగా ధ్రువీకరణ పత్రం రావాలని వెల్లడించింది.
Also Read: ఆ ఆపరేషన్ కు మహాదేవ్ పేరు ఎందుకు.. ఇన్నాళ్లుగా దొరకని ఉగ్రవాదులు ఎలా చిక్కారు?
అది నిజం కాదట
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు సంబంధించిన ఘటనలో వస్తున్న సమాచారం నిజం కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇంతవరకు నిమిష ప్రియ మరణశిక్ష రద్దు విషయంలో ఇంతవరకు అక్కడి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయని.. ఇవేవీ నిజం కాదని దేశ విదేశాంగ శాఖ చెప్పినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అయితే యెమెన్ – భారత్ మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఇటువంటి సమాచార వ్యాప్తి ఏర్పడుతోందని తెలుస్తోంది. నిమిష ప్రియ కి సంబంధించిన కేసులో తొలి నుంచి కూడా అనేక రకాల మలుపులు చోటు చేసుకుంటున్నాయి. క్షమాధనం కింద పరిహారం చెల్లిస్తామని నిమిష ప్రియ లేకుండా చెబుతున్నప్పటికీ.. మృతుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. నేరం చేసింది కాబట్టి శిక్ష అనుభవించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.