Telangana Assembly elections 2024 Results : రేవంత్ లో టెన్షన్.. టెన్షన్..

Telangana Assembly elections 2024 Results :  ఇటీవల రిలీజ్ చేసిన ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ కు 6 నుంచి 7, బీజేపీకి 7 నుంచి 8, బీఆర్ఎస్, ఎంఐఎం కు ఒక్కోటి వస్తుందని ప్రకటించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఎలా? అన్న ఆందోళన మొదలైంది.

Written By: Srinivas, Updated On : June 4, 2024 8:18 am

CM Revanth Reddy

Follow us on

Telangana Assembly elections 2024 Results :  2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో టెన్షన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్షగా మారాయి. ఏడాది కిందటి వరకు కాంగ్రెస్ కొన్నిసీట్లయినా గెలుస్తుందని అనుకోని వారితో కలిసి రేవంత్ రెడ్డి మొత్తంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఢిల్లీ అధిస్టానం ఆయనకు పార్లమెంట్ ఎన్నికల విషయంలో పెద్ద బాధ్యత అప్పజెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఎక్కువగా సీట్లు వస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నట్లుగా అధిష్టానం రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. అయితే తెలంగాణలో బీజేపీ తో పాటు బీఆర్ఎస్ పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయోనన్న టెన్షన్ రేవంత్ రెడ్డిలో మొదలైంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ పుంజుకుంది. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీలో కొనసాగిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థి సైతం కాంగ్రెస్ లో చేరారు. దీంతో పార్టీకి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కొట్టాలనే తపన పీసీసీ చీఫ్ తో పాటు నాయకుల్లో నెలకొంది. దీంతో ప్రతి ఒక్క కార్యకర్త తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో కాంగ్రస్ 12కు పైగానే సీట్లు వస్తాయన్న ధీమాతో చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ కు 6 నుంచి 7, బీజేపీకి 7 నుంచి 8, బీఆర్ఎస్, ఎంఐఎం కు ఒక్కోటి వస్తుందని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఎలా? అన్న ఆందోళన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మోడీ చరిస్మాతో ఇక్కడి పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. దీంతో చాలా అభ్యర్థులను కాకుండా మోడీని దృష్టిలో ఉంచుకొని ఓట్లు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో అధికారంలో ఉండి సీట్లు తక్కువ వస్తే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? అన్న చర్చల్లో రేవంత్ టీం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని చెబుతూ వచ్చారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తరువాత ఆ పార్టీ నాయకుల్లో నిరుత్సాహం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ను కాకుండా బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తేనే పరువు దక్కుతుంది. లేదంటే కాంగ్రెస్ పై విమర్శలకు ఇదో కారణమవుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.