https://oktelugu.com/

తెలంగాణ సర్కార్ మరో భారీ ఆఫర్

హైదరాబాద్ సహా నగరాల్లో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. అక్రమంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. దీంతో ఈ అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం ఇచ్చింది. Also Read: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల్లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వీలుగా తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ఎల్.ఆర్.ఎస్ మేళాలు నిర్వహించనుంది. ఈ సారి ఎల్.ఆర్ఎస్ అవకాశం కేవలం నూతన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 09:33 AM IST

    Land in Telangana

    Follow us on

    హైదరాబాద్ సహా నగరాల్లో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. అక్రమంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. దీంతో ఈ అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం ఇచ్చింది.

    Also Read: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల్లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వీలుగా తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ఎల్.ఆర్.ఎస్ మేళాలు నిర్వహించనుంది.

    ఈ సారి ఎల్.ఆర్ఎస్ అవకాశం కేవలం నూతన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశారు.

    ఈ సందర్భంగా కొత్త మున్సిపాలిటీల్లో ఎల్.ఆర్ఎస్ అవకాశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    Also Read: బ్రేకింగ్ : తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్

    ఇక ఎల్.ఆర్.ఎస్ పై అవగాహన కల్పించేందుకు ప్రతీ మంగళ, శనివారాల్లో మేళాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ ఆదేశించింది. అక్రమ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ తో క్రమబద్దీకరించుకోవాలంటున్నారు.