ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు. విలన్ గా కమెడియన్ గా ఆయన నటనా గొప్పతనాన్ని గురించి భవిష్యత్తు తారలు మరియు తరాలు తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతంలోనూ ఆయన గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ, ఈ తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. దాంతో వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read: టీవీ9 దేవి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
నిజానికి ఆయన రేపు హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి. కానీ ఈ లోపే ఈ దారుణం జరిగిపోయింది. ఇక గత ఐదు నెలలు నుండి కరోనా కారణంగా సినీమా షూటింగ్ పై ప్రభుత్వ నిషేధం ఉండడంతో ఆయన గుంటూరులోని తన కుమారుడి నివాసంలోనే ఉంటున్నారు. 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. బ్రహ్మపుత్రుడు చిత్రంతో రామానాయుడు సహాయంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత అవకాశాలు లేక మళ్లీ కొన్నాళ్ళు జాబ్ చేసి.. ఎలాగోలా మళ్లీ ఇండస్ట్రీకే వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
Also Read: బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్
ముఖ్యంగా రాయలసీమ మాండలీకంతో ఆయన పలికే మాటలు అలాగే కామెడీ విలనిజమ్ తో పాటు సీరియస్ విలన్ గానూ ఆయన పలు పాత్రలను పండించి తనకంటూ ప్రత్యేకమైన నటుడిగా నిలిచిపోయారు. Oktelugu.com తరఫున జయప్రకాశ్ రెడ్డి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.