Teenmaar Mallanna : జర్నలిస్టుగా.. యూ ట్యూబ్ ఛానల్ ఓనర్ గా తీన్మార్ మల్లన్న తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం.. స్వతంత్రంగా ఎమ్మెల్సీగా పోటు చేసి.. నాటి అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో చేరాడు. కొంతకాలానికి అందులో నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించలేదు. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో తన వాయిస్ మాత్రమే వినిపించాడు. అవసరమైతే అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా వెనుకాడడం లేదు.. ఆమధ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో.. సొంత పార్టీ నాయకులే తీన్మార్ మల్లన్న పై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోలేదు. పైగా ఇటీవల నిర్వహించిన బీసీ సభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ సామాజిక వర్గంపై కూడా తీవ్రంగా మండిపడ్డారు.. ప్రస్తుతం కొనసాగుతున్న రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. 2028 లో ఖచ్చితంగా బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని.. తీన్మార్ మల్లన్న స్పష్టం చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి..
నాలుక మడత పెట్టాడు
కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవాడు. అయితే అనూహ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేను మల్లన్న విమర్శించాడు. ఆ సర్వే జరిగిన తీరు సహేతుకంగా లేదని మండిపడ్డాడు. అయితే కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజుల్లో సమగ్ర సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో తెలియదు కాని.. ఆ సర్వేను నూటికి నూరు శాతం కరెక్ట్ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అయితే మంగళవారం నాటి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నాటి కెసిఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సర్వేలో పందుల లెక్క ఎంత ఉందో చెప్పారు గానీ.. బీసీల లెక్క ఎంత ఉందో చెప్పలేదని నాలుక మడత పెట్టారు. కేవలం రోజు వ్యవధిలోనే మల్లన్న మాట మార్చడంతో సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మల్లన్న తీరుపై మండిపడుతున్నారు. సోమవారం ఒక మాట.. మంగళవారం మరొక మాట.. ఇలా నాలుక మడత ఎందుకు పెడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి మాటమీద నిలబడే సత్తా ఉండాలని.. కానీ తీన్మార్ మల్లన్న విద్యాధికుడైనప్పటికీ ఇలా వ్యవహరించడం సరికాదని దుయపడుతున్నారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తప్పు పట్టడం విశేషం.
సోమవారం మల్లన్న… మంగళారం మల్లన్న… pic.twitter.com/810VISEbHv
— Shankar reddy (@reddyis) February 4, 2025