Teenmar Mallanna : తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు సొంతంగా ఎన్నికల్లో పోటీచేసిన తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపడు నవీన్‌కుమార్.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రాజకీయ నేతగా కన్నా.. యూట్యూబర్‌గానే ఎక్కువ మందికి తెలుసుకు, మాజీ సీఎం కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్(KTR), మంత్రి హరీశ్‌రావు(Harish Rao), ఎమ్మెలీస కల్వకుంట్ల కవితపై విరుచుకుపడుతూ.. వారి పనులు విమర్శిస్తూ ప్రజలకు చేరువయ్యారు. కేసీఆర్, కేటీఆర్‌ను అయితే బండ బూతులు తిట్టారు. కేసీఆర్ పాలనను పూర్తిగా తప్పు పట్టారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశాక బీసీ గలం అందుకున్న మల్లన్న.. తాజాగా కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు)ను కలవడం చర్చనీయాంశమైంది. తీన్మార్ మల్లన్నను బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ముప్పు తిప్పలు పెట్టింది. ఆయన యూట్యూబ్ స్టుడియోపై దాడి చేయించింది. ఇంత ఇబ్బంది పడ్డ తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : తీన్మార్ మల్లన్నను నడిపిస్తున్నది కేసీఆర్.. ఇందులో నిజమెంత..
బీసీ బిల్లు కోసం..
తీన్మార్ మల్లన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బీసీ బిల్లుపై చర్చించేందుకే అని సమాచారం. బీసీ కుల గణనను తప్పు పడుతున్న మల్లన్న.. బీఆర్‌ఎస్ బీసీ బిల్లుపై అసెంబ్లీలో నిలదీయాని కేటీఆర్‌ను కోరినట్లు తెలిసింది. అయితే, ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు లేదా అధికారిక ధ్రువీకరణ ఇంకా స్పష్టంగా లేదు.
డ్రామారావు అంటూ..
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నాటి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు తీన్మార్ మల్లన్న. కేటీ రామారావు పేరును.. డ్రామారావుగా మార్చారు. డ్రామాలు వేస్తాడు అన్నట్లుగా ఈ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక కేసీఆర్‌ను అయితే.. అనని మాట లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి తీన్మార్ మల్లన్న పరోక్షంగా కృషి చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ ‘క్యూ న్యూస్‘ ద్వారా బీఆర్‌ఎస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గతంలో విమర్శలు చేసిన మల్లన్న ఇప్పుడు సహకారం కోరుతూ కేటీఆర్‌ను కలవడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది. ఈ మార్పు వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక బీసీ అంశంపై ఐక్యత కోసమేనా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Also Read : సర్ ప్రైజ్ : తీన్మార్ మల్లన్న బ్యాచ్ బీఆర్ఎస్ భజన చేస్తోందేంటి?