Teenmar Mallanna: అధికారంతమున చూడాలి అయ్య వారి చిత్రాలు.. ఈ సామెత కేవలం రాజకీయ నాయకులకే కాదు.. మీడియా అధిపతులకు.. యూట్యూబర్లకు కూడా ఇది వర్తిస్తుంది.. అందువల్లే నయా కాలంలో ప్రజలు ఎవరినీ నమ్మని పరిస్థితి నెలకొంది. మీడియాధిపతులు చెబుతున్న నీతులను.. ప్రసారం చేస్తున్న వార్తలను ఎవరూ విశ్వసించని దుస్థితి ఏర్పడింది.
Also Read: కేంద్ర మంత్రిపై తెలంగాణ సీఎం సంచలన ఆరోపణలు.. రేవంత్‌రెడ్డి లక్ష్యం ఏంటి?
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మొదట్లో వి6 ఛానల్ లో పనిచేసేవారు. ఆ తర్వాత క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రశ్నించే గొంతుకగా తనను తాను అభివర్ణించుకున్నారు. నాడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాడు భారత రాష్ట్ర సమితి తీన్మార్ మల్లన్న పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చింది. పలుమార్లు కేసులు పెట్టింది. జైళ్లకు కూడా పంపించింది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బయటికి తీసుకొచ్చారు. అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేర్పించారు. ఆ తర్వాత కొంతకాలానికే తీన్మార్ మల్లన్న బిజెపి నుంచి బయటికి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న పోటీ చేసి గెలిచారు.
వ్యతిరేక స్వరం వినిపించడంతో..
కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన మల్లన్న.. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కుల గణనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఓ సామాజిక వర్గంపై మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనికి తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పకపోవడంతో వేచి చూసిన పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న తన క్యూన్యూస్ ద్వారా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఎండగట్టడం ప్రారంభించారు. ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు కవిత, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. క్యూ న్యూస్ లో వస్తున్న వీడియోలను భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రచారం చేయడం సరికొత్త చర్చకు కారణమవుతోంది. ఈ లెక్కన తీన్మార్ మల్లన్న భారత రాష్ట్ర సమితిలో చేరుతారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొదట్లో బిజెపి.. తర్వాత కాంగ్రెస్.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పార్టీలు మారిన నాయకుడిగా తీన్మార్ మల్లన్న నిలిచిపోతారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి భజన చేయడానికి తీన్మార్ మల్లన్న కంకణం పట్టుకున్నారని.. ఇకపై అదే పని చేస్తారని వారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: హరీశ్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం.. ఆధారాలతో నిరూపిస్తానని ప్రకటన!
ఈ చెంచా గాళ్ళేంది గిటు తిరిగిండ్రు…
కేటీఆర్,హరీష్ రావు,కవిత వీళ్ళు ముగ్గురు సబ్జక్ట్ తోటి మాట్లాడుతారు..కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కడికి సబ్జక్ట్ ఉండదు…
ఈ ముగ్గురు సమర్తవంతమైన నాయకులు..వీళ్ళని తట్టుకోవడం మామూలు విషయం కాదు..గట్లుంటది మరి మా నాయకులు అంటే @KTRBRS @BRSHarish… pic.twitter.com/xcY22fks6w
— ChAnduBRS✊ (@IamPRVChAnduBRS) March 2, 2025