https://oktelugu.com/

Teenmar Mallanna : అల్లు అర్జున్ ను పరామర్శించే వాళ్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ప్రస్తుతం అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆయన ఒక రోజు పాటు జైలుకు వెళ్లిన సంఘటనను ఉద్దేశించి ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క హీరో తన ఇంటికి వచ్చి అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు. ఇలా చేయడం పట్ల కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరి కొంత మంది మాత్రం ఈ విషయం మీద నెగెటివ్ గా స్పందిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2024 / 04:46 PM IST

    Teenmar Mallanna-Allu Arjun

    Follow us on

    Teenmar Mallanna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది. ప్రస్తుతం చాలా మంది హీరోలు ఏదో ఒక విధంగా వివాదాల్లో నిలుస్తున్నారు… మొన్నటిదాకా మంచు ఫ్యామిలీ తమ ఆస్తుల విషయంలో గొడవలు పెట్టుకొని వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేగింది. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక ఆ మరణం పట్ల రేవతి భర్త అల్లుఅర్జున్ మీద కంప్లైంట్ చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు… ఇక అంతలోకే హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. దాంతో అల్లు అర్జున్ మద్యంతర బెయిల్ మీద బయటకైతే వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అతన్ని చాలామంది పరామర్శిస్తున్నారు. ఇక దీని మీద తెలంగాణ ఎమ్మెల్సీ నాయకుడు అయిన తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించాడు. అల్లు అర్జున్ ఏదైనా యుద్ధం చేసి వచ్చాడా ఎందుకు అతన్ని పరామర్శిస్తున్నారు. మహా అయితే ఆయన ఒక పది గంటలు కూడా జైల్లో లేడు. ఆ మాత్రం దానికి అతన్ని పరామర్శించడం ఎందుకు…

    అతన్ని ఎవరైనా కొట్టారా, మ్యాన్ హాండ్లింగ్ చేశారా అంటూ మాట్లాడాడు…ఇక పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి ఇంటి కుటుంబానికి ఎంతమంది వెళ్లారు. తన కొడుకు ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హాస్పిటల్ కి వెళ్లి అతన్ని చూసి ఆ కుటుంబాన్ని ఎంతమంది పరామర్శించారు. ఎందుకు ఇలాంటి ధోరణిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు వ్యవహరిస్తున్నారు.

    అల్లు అర్జున్ కి ఏం జరిగిందని ఆయనను పరామర్శించాల్సిన అవసరం ఏర్పడింది అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. మీరు ఒకరికి ఒకరు సినిమాల మీద ప్రేమ ఉంటే చూపించుకోండి. అంతేకానీ ఇలాంటి సంఘవిద్రోహ చర్యలు జరిగినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది.

    దానికి గవర్నమెంట్ బాధ్యత వహించాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలైతే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న హీరోలందరూ చనిపోయిన రేవతి వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తే అప్పుడు మీరు మంచి హీరోలుగా జనాల్లో గుర్తింపబడతారు. అంతే తప్ప అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి అతన్ని పరామర్శిస్తే మీరు ఏదో గొప్ప పని చేసినట్టు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది