https://oktelugu.com/

IND VS AUS Test Match : టీమిండియా లో అదే లోపం.. అందువల్లే ఆస్ట్రేలియా చేతిలో శాపం..

స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ కు ముందు టెస్టులలో టీమిండియా నెంబర్ వన్. అంతటి బలమైన ఇంగ్లాండ్ జట్టును కూడా మట్టికరిపించింది. ఐదు టెస్టుల సిరీస్ ను 4-1 తేడాతో గెలిచింది. ముచ్చటగా మూడోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లడానికి దారులు పటిష్టంగా వేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 15, 2024 / 05:03 PM IST

    IND VS AUS Test Match

    Follow us on

    IND VS AUS Test Match :  ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో మూడు టెస్టులు ఓడిపోయిందో టీమిండియా కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాలోకి అడుగు పెట్టింది. పెర్త్ టెస్టులో విజయం సాధించింది. అడిలైడ్ లో ఓడిపోయింది. ఇప్పుడు బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా పై పట్టు సాధించలేకపోతోంది. రెండవ రోజు ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. చూడబోతే ఈ మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.. బౌలింగ్లో పస లేకపోవడం భారత జట్టును పసికూనలాగా మార్చుతోంది.. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు హెడ్, స్మిత్ సెంచరీలతో చెలరేగిపోవడం మన బౌలింగ్లోని బేలతనాన్ని చూపిస్తోంది.. హెడ్, స్మిత్ ఏకంగా నాలుగో వికెట్ కు 241 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారంటే భారత జట్టు బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో బుమ్రా సాధించిన ఐదు వికెట్ల ప్రదర్శన మాత్రమే భారత జట్టుకు కాస్తో కూస్తో ఆనందం కలిగించింది. బుమ్రా మాదిరిగా మిగతా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పండగ చేసుకున్నారు. మైదానంపై బుమ్రా మాత్రమే సరైన పేస్ రాబట్టాడు. పచ్చికను తనకు అనుకూలంగా మలచుకున్నాడు మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

    పండగ చేసుకున్నారు

    టీమిండియా బౌలర్ల వైఫల్యాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. చివరికి కమిన్స్, క్యారీ జోడి కూడా 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిందంటే.. భారత బౌలర్ల బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్లో బుమ్రా లేకపోతే భారత్ ఆకాస్త వికెట్లు కూడా సాధించలేకపోయేది. హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ ను తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా జట్టుకు ఊహించిన అంత లాభాన్ని చేకూర్చలేకపోయారు. నితీష్ రెడ్డి పదునైన బంతులు వేస్తున్నప్పటికీ.. వాటిని వికెట్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. బుమ్రా మాదిరిగా మిగతా బౌలర్లు పేస్ సాధించలేకపోవడం.. బంతిపై నియంత్రణను కలిగి లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా బ్యాటర్లు పండగ చేసుకున్నారు. బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడంతో టీమిండియా త్వర త్వరగా వికెట్లు తీయలేకపోయింది. బుమ్రా మాత్రమే ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచగలిగాడు. మిగతా వారంతా చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా ప్రయాణం సాగిస్తోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచే పరిస్థితి లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో గత టెస్టులో భారత బ్యాటర్లు ఎలా దాసోహమయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా గబ్బా మైదానంలో ఇప్పుడున్న ఆస్ట్రేలియా బౌలర్లకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. వారంతా కూడా పదునైన బంతులు వేయగలరు. వికెట్లను పడగొట్టగలరు.