Rajkumar Hirani and Prashant Neel : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా చేసిన సినిమాలన్నింటితో మంచి విజయాలను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు అని చెబుతున్నప్పటికి ప్రతి ఒక్క దర్శకుడు ఏదో ఒక స్టేజ్ లో ఏదో ఒక ఫ్లాప్ సినిమానైతే మూటగట్టుకున్నారు. నిజానికి మొన్నటి వరకు రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar Hirani) లాంటి దర్శకుడికి ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదనే ఒక గొప్ప గుర్తింపైతే ఉండేది. కానీ షారుక్ ఖాన్ (Sharukh Khan) తో చేసిన డంకి (Dunki) సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన కూడా ప్లాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇతనితో పాటు ప్రశాంతి నీల్ (Prashanth Neel) కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటూ చెబుతూ ఉంటారు. కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ (Salaar) సినిమాను కూడా సూపర్ సక్సెస్ చేసిన ఘనత అతనికే దక్కుతుంది. కానీ ఆయన మొదట చేసిన ఉగ్రం సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అందువల్లే ఆ సినిమా స్టోరీని మళ్ళీ సలార్ గా చేసి భారీ విజయాన్ని దక్కించుకోవాలనే ఆయన తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. ఇక అట్లీ లాంటి దర్శకుడికి సైతం కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదని చాలా గర్వంగా చెబుతూ ఉంటారు. కానీ రీసెంట్ ఆయన తేరి సినిమాను ‘ బేబీ జాన్’ గా తీశారు ఈ సినిమా ఫ్లాప్ అయింది. అంతే ఆయన కథ బాలీవుడ్ వాళ్ళను మెప్పించలేకపోయింది. కాబట్టి అది ఆయన ప్లాప్ గానే పరిగణించాలి…
Also Read : 1960 బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా..KGF వరల్డ్ తో లింక్ కూడా ఉందా?
ఈ ముగ్గురు దర్శకులు సైతం ఇంతకు ముందు వరకు ఒక్క ఫ్లాప్ ని కూడా మూటగట్టుకున్నప్పటికీ రీసెంట్ గా వీళ్ళు చేసిన సినిమాలతో మాత్రం వీళ్ళు భారీగా బోల్తా కొట్టారనే చెప్పాలి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి మాత్రమే అని చాలా గర్వంగా చెప్పుకోవాలి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనిల్ రావిపూడి సైతం ఎనిమిది సినిమాలు చేస్తే 8 సక్సెస్ లను అందుకున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నప్పటికి ఎఫ్3 సినిమా ఆశించిన మేరకు విజయమైతే సాధించలేదు. ఇక రాజమౌళి కెరియర్ లో చూసుకుంటే ప్రతి సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటూ వస్తున్నాయి.
అందువల్లే ఆయన సినిమాలు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకునేలా చేశాయి. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఫెయిల్యూర్ ని కూడా చవిచూడని దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజమౌళి గారే కావడం విశేషం…
Also Read : ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో సినిమా..ఈసారి పౌరాణిక కథతో రాబోతున్నారా?