Jubilee Hills By Election TDP: తెలంగాణలో( Telangana) ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్ ఫలితాలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అక్కడ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బిజెపి సైతం గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉంది. ఇది గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం. దీంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం గట్టిగానే పోరాడుతోంది. ముస్లింలను తమ వైపు తిప్పుకునేందుకుగాను అజారుద్దీన్ కు ఏకంగా మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అధికారం, ఇంకోవైపు సామాజిక ఈక్వేషన్స్ నడుమ విజయం సాధిస్తాం అన్న ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ సర్వేలు మాత్రం బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు ప్రధాన పార్టీలు చూస్తున్నాయి.
* జనసేన మద్దతు?
వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) టిడిపి తో పాటు జనసేన మద్దతు ప్రకటించాలి. కానీ బిజెపి అడిగిందో.. లేదో తెలియదు కానీ జనసేన పార్టీ తరఫున బిజెపి మద్దతు ప్రకటన వచ్చింది. కానీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాలేదు. తెలంగాణకు చెందిన జనసేన నేతలు బిజెపికి మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఎవరికీ అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటివరకు టిడిపి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మెజారిటీ టిడిపి శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి తమ వాడు అన్న అభిప్రాయం టిడిపి క్యాడర్లో ఉంది. అందుకే అన్నదికారికంగా టిడిపి శ్రేణులు కాంగ్రెస్కు జై కొడుతున్నాయి.
* బిఆర్ఎస్ అభ్యర్థితో సన్నిహితం
మరోవైపు బీఆర్ఎస్( BRS) అభ్యర్థి కుటుంబ నేపథ్యం అంతా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటుంది. ఆపై చంద్రబాబు కుటుంబంతో చనిపోయిన ఎమ్మెల్యే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2014లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా టిడిపి నుంచి గాంధీ గెలిచారు. తరువాత గులాబీ పార్టీలో చేరిపోయారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆయన ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గం కొంతవరకు గాంధీకి మద్దతు తెలుపుతోంది. అయితే బిజెపి కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాత్రం తమకు టిడిపి తో పాటు జనసేన మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే టిడిపి అధికారిక ప్రకటన చేస్తుందా? లేకుంటే పార్టీ శ్రేణుల ఇష్టానికి వదిలేస్తుందా? అన్నది చూడాలి.