Kaantha Trailer Review: కేరళ లో స్టార్ హీరో గా కొనసాగుతూ, తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరో గా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ఈమధ్య కాలం లో బాగా ఎదిగాడు. మన టాలీవుడ్ లోకి ‘మహానటి’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన, ఆ తర్వాత ‘సీతా రామం’ తో సూపర్ హిట్ ని అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. ఈ రెండు సినిమాల తర్వాత గత ఏడాది ఆయన తెలుగు లో చేసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత అంతకు పదింతలు పెద్ద హిట్ అయ్యింది. మన టాలీవుడ్ నుండి నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న టాప్ 2 చిత్రాల్లో ఇది ఒకటి.
Also Read: నెట్ ఫ్లిక్స్ లో ‘ఓజీ’ ని డామినేట్ చేసిన ‘ఇడ్లీ కొట్టు’..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
అంతటి సెన్సేషన్ తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న మరో తెలుగు చిత్రం ‘కాంతా'(Kantha Movie). దగ్గుబాటి రానా(Rana Daggubati) ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ కూడా సహా నిర్మాతగా బాధ్యతలు వహించాడు. భాగ్యశ్రీ భొర్సే(Bhagyasri Bhorse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా నేపథ్యం లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ ఇందులో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం లోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా కనిపించనున్నాడు. సముద్రఖని ఇందులో మూవీ డైరెక్టర్ గా, నిర్మాతగా కనిపించనున్నాడు. హీరో కి ఈయనకు మధ్య జరిగిన కొన్ని గొడవలు, దాని కారణంగా ఎదురైనా పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది.
దగ్గుబాటి రానా ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. ట్రైలర్ లో ఆయన క్యారక్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. చూస్తుంటే ఇందులో దుల్కర్ సల్మాన్ తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా ఆయన నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంటాడు. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందినదే. గతం లో ఆయన సినీ నేపథ్యం లో ‘మహానటి’ చిత్రం చేసాడు. ఇందులో కూడా ఆయన తమిళ సూపర్ స్టార్ జెమినీ గణేశన్ క్యారక్టర్ లో కనిపించాడు. ఇప్పుడు నిజ జీవితం లోని సూపర్ స్టార్ క్యారక్టర్ చేశాడా?, లేదంటే ఫిక్షనల్ క్యారక్టర్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 14 న విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.