https://oktelugu.com/

KTR: టార్గెట్ కేటీఆర్.. కేసు నమోదు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం.. రేవంత్ దూకుడు వెనుక కథేంటి?

మొదటిసారి హైదరాబాద్‌లో 20203 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్డులో పార్ములా-ఈ కార్‌ రేసు నిర్వహించారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 08:28 PM IST

    Revanth Reddy-KTR

    Follow us on

    KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా ఏసీబీ పేర్కొంది. అయితే మొత్తం నాలుగు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని 13 (1A), 13(2), 409,120 ఈ సెక్షన్ల ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఫార్ములా ఈ-కారు రేస్ విషయంలో ఎప్పటి నుంచో కేటీఆర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదించడంతో ఈ కేసు కాస్త ముందుకెళ్లింది. అలాగే ఈ కేసులో విషయంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఏసీబీకి లేఖ రాసింది. రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎవరు? ఎలా చేశారనే విషయాలపై దర్యాప్తు చేయాలని శాంతకుమారి ఏసీబీకి లేఖ రాశారు. అప్పుడే కేటీఆర్‌ అరెస్టు గ్యారెంటీ.. అంతా సిద్ధమేనని.. మరో రెండు రోజుల్లో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

    అసలు కేసు ఏంటంటే?
    మొదటిసారి హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్డులో పార్ములా-ఈ కార్‌ రేసు నిర్వహించారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 55 కోట్లు చెల్లించారని కేటీఆర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ ఇది కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇందులో దాదాపుగా రూ.46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. అసలు ప్రభుత్వ నిధులు ఎవరు మళ్లించారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఫార్ములా సంస్థ ఖాతాకు ఎలా వెళ్లాయనే కోణంలో కేసును పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఫార్ములా సంస్థకు కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఏ క్షణమైన అరెస్టు..?
    కేటీఆర్‌ను ఏ క్షణమైన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏసీబీ అన్నింటికి సిద్ధం చేస్తోంది. గవర్నర్ ఆమోదం వచ్చిన వెంటనే కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ అరెస్టు విషయంలో ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతోంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దూకుడు చూపిస్తోంది. బీఆర్‌ఎస్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. ముందుస్తు జాగ్రత్తల కోసం పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.