HomeతెలంగాణSwiggy 2021 Report: మ‌రోసారి బిర్యానీకే జై కొట్టిన హైద‌రాబాద్‌.. ఆరోగ్యానికి ప్రాధాన్య‌త పెర‌గిందట‌..

Swiggy 2021 Report: మ‌రోసారి బిర్యానీకే జై కొట్టిన హైద‌రాబాద్‌.. ఆరోగ్యానికి ప్రాధాన్య‌త పెర‌గిందట‌..

Swiggy 2021 Report: భాగ్య‌న‌గ‌రం ప్ర‌జ‌లు ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇంత‌కు ముందులాగా కాకుండా టేస్ట్ కంటే హెల్త్ ముఖ్యం అనేస్తున్నారు. ఇందుకు కార‌ణం క‌రోనా. అవును క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత హైద‌రాబాద్ ప్ర‌జ‌ల అభిరుచులు బాగా మారిపోయాయి. వారంలో రెండు రోజులు మిన‌హాయించి మిగ‌తా రోజులు మాత్రం ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని స్విగ్గీ వివ‌రించింది. ఎప్ప‌టి లాగే ఈ ఏడాది కూడా స్టాట్‌ఈటస్టిక్స్‌-2021 ను రిలీజ్ చేసింది స్విగ్గీ.

Swiggy 2021 Report
Swiggy 2021 Report

ఇందులో గ‌తంలో కంటే కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్ కే ఇంపార్టెన్స ఇస్తున్నార‌ని వివ‌రించింది స్విగ్గీ. ఈ త‌ర‌హా ఆర్డ‌ర్లు త‌మ సంస్థ‌లో 23 శాతం, అలాగే మొక్కల ఆధారిత వంట‌కాల‌కు సంబంధించిన ఆర్డ‌ర్లు 83 శాతం పెరిగినట్లు వివ‌రించింది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా సోమవారం, గురువారం మాత్ర‌మే హెల్తీ ఫుడ్ తినేందుకు ప్ర‌త్యేకంగా ఆర్డ‌ర్లు పెట్టుకుంటున్నారంట‌. ఇలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తినే జాబితాలో బెంగళూరు ముందుంది.

ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే మాత్రం ఎక్కువ‌గా మాంసాహారాన్ని తినేంద‌కు ఇష్టపడుతున్నట్టు స్విగ్గీ వివ‌రించింది. ఇందులో ఎక్కువ‌గా చికెన్ బిర్యానీకి ఫ‌స్ట్ ప్లేస్ ఇచ్చారు. హైద‌రాబాద్ న‌గ‌ర వాసులు ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన దాంట్లో చికెన్ బిర్యానీ ఉంది. దీని త‌ర్వాత చికెన్ 65, ఆ త‌ర్వాత పనీర్‌ బటర్‌ మసాల ఉన్నాయి. ఇక టిఫిన్ల విష‌యానికి వ‌స్తే మసాల దోశ‌, ఇడ్లీ ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేస్తున్నారంట‌.

Also Read: Meaning Of Dreams: ఈ వస్తువులు కలలో కనిపిస్తే మీకు జీవితంలో ఎదురుండడు.. అన్ని శుభాలే!

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. కేవ‌లం హైద‌రాబాద్ లోనే కాదండోయ్‌.. చెన్నై, లక్నో, కోల్‌కతా లాంటి సిటీల్లో కూడా మ‌న చికెన్‌ బిర్యానీకే ఫ‌స్ట్ ప్లేస్ ద‌క్కింది. ఇక ప్ర‌తి ఏడు బిర్యానీకి మొదటి ప్లేస్ ద‌క్కుతోంద‌ని స్విగ్గీ సంస్థ తెలిపింది. ప్ర‌తి మినిట్‌కు 115 బిర్యానీలు మ‌న దేశంలో ఆర్డ‌ర్ చేస్తున్నారంట‌. ఇలా వ‌రుస‌గా ఆరో సంవ‌త్స‌రం కూడా బిర్యానీ మొద‌టి స్థానంలో ఉంది. అయితే దీనితో పాటు సమోసాల‌కు కూడా బాగానే ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయంట‌.

Also Read: Money: రోడ్డుపై దొరికిన డబ్బులను తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version