AP Govt: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. తండ్రి బాటలోనే ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలందించాలని తాపత్రయపడుతుంటారు. కానీ దానికి అనుగుణంగా అడుగులు మాత్రం పడటం లేదు. దీంతో హెల్త్ హబ్ గురించి గొప్పగా చెబుతున్నా దాని ఊసే ఎత్తడం లేదు. టెండర్లు వేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజల కోరిక తీరని ఆశగానే మిగిలిపోతోంది. మీడియా సాక్షిగా వైద్యం గురించి ప్రకటనలు చేస్తున్నా ఎక్కడ కూడా ఆచరణ మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యకరమే.
హెల్త్ హబ్స్ కోసం 13 జిల్లాల్లో కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణాలు చేసేందుకు సిద్ధమైనా దానికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. టెండర్ల కోసం ఆహ్వానించినా ఎవరు కూడా టెండర్ వేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టెండర్లకు భారీ స్పందన వచ్చిందని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణ మాత్రం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు టెండర్ లో పాల్గొన్నట్లు చెప్పినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడం దారుణం.
అపోలో, కేర్, కిమ్స్, సన్ షైన్, రెయిన్ బో లాంటి కార్పొరేట్ వైద్య సంస్థలు సైతం ముందుకు రాకపోవడంతో ఏపీలో వైద్య సదుపాయాల కోసం ఏర్పాటు చేసే ఆష్పత్రుల నిర్మాణం కలగానే మిగిలిపోతుందేమోననే బెంగ పట్టుకుంది. దీనిపై జగన్ ప్రభుత్వం మాత్రం అడుగు పడుతుందని చెబుతున్నా ఇంకా ఎప్పుడు అనే సందేహాలు వస్తున్నాయి.
Also Read: Exhibitors: ప్రభుత్వంతో ‘ఫైట్’కు సిద్ధమవుతున్న సినీ ఎగ్జిబిటర్లు..!
హెల్త్ హబ్స్ కోసం రూ. 100 కోట్ల పెట్టుబడితో వంద పడకలతో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కార్పొరేట్ సంస్థలను స్వాగతిస్తున్నా అవి ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆశయం కాస్త వెనకడుగు వేస్తోంది. దీంతో నిబంధనలు సడలించి అయినా టెండర్లు వేయాలని చూస్తున్నా ఏ సంస్థ ముందడుగు వేయడం లేదు. దీంతో సర్కారు సైతం ఏం చేయలేకపోతోంది. ఎప్పటికి ప్రభుత్వ ఆశయం నెరవేరి ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: Special status: ప్రత్యేక హోదాపై ‘ఏపీ’ ఆశలు వదులుకున్నట్లేనా?