Swecha Votarkar Death Case: పాత్రికేయురాలు స్వేచ్ఛ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆమె మరణం పై అనేక రకాల ఊహాగానాలు.. రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఇన్ని రోజులపాటు స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచంద్రరావు పేరుమీద మీడియాకు కొన్ని లేఖలు అందాయి. ఆ లేఖలలో పూర్ణచందర్రావు సంచలన విషయాలను పేర్కొన్నాడు.
అందరూ అనుకున్నట్టుగా స్వేచ్ఛకు ఒక వివాహం మాత్రమే జరగలేదట. ఆమెకు ఏకంగా రెండు పెళ్లిళ్లు జరిగాయట. 2008లోనే ఆమెకు వివాహం జరిగిందట. ఏడాది కాలంలోనే అంటే 2009లోనే మొదటి భర్త ద్వారా ఆమె విడాకులు తీసుకుందట. ఇక 2016లో రెండవ వివాహం చేసుకుందట. రెండవ భర్త ద్వారా ఆమెకు పాప కలిగిందట. ఆ తర్వాత 2017 లోనే ఆమె విడాకులు తీసుకున్నదట. 2009 నుంచే పూర్ణకు స్వేచ్ఛకు పరిచయం ఉందట. 2017లో రెండవ భర్త ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత.. పూర్ణతో తరచూ మాట్లాడేదట. 2020లో పూర్ణ స్వేచ్ఛ దగ్గరయ్యారట.. అయితే రెండవ భర్త ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయిందట.. అయితే స్వేచ్ఛ తండ్రి శంకర్, తల్లి శ్రీదేవి ఆమెను ఏమాత్రం పట్టించుకునే వారు కాదట. శంకర్ జనశక్తి సానుభూతిపరుడుగా ఉండేవాడట. శ్రీదేవి మహిళా సంఘం లో కీలకంగా పనిచేసేదట. వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంవల్ల స్వేచ్ఛను పెద్దగా పట్టించుకునే వారు కాదట. స్వేచ్ఛకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే తమ అన్న వదినల వద్ద విడిచి శంకర్, శ్రీదేవి జనశక్తి లో పని చేసేందుకు వెళ్లారట..
స్వేచ్ఛ రెండవ భర్త ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల వద్ద ఉన్నదట. ఆ సమయంలో శంకర్, శ్రీదేవి తరచూ గొడవ పడుతూ ఉండేవారట. వారి గొడవ చూడలేక కవాడిగూడలో అద్దెకు ఇల్లు తీసుకొని ఉండడం ప్రారంభించిందట. ఆ తర్వాత కొద్ది రోజులకే తన పాప అరణ్యను కూడా తన తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకొచ్చి తన వద్ద ఉంచుకోవడం మొదలుపెట్టిందట.. అయితే తాను ఎదుర్కొంటున్న బాధను మొత్తం పూర్ణచందర్ తో చెప్పుకునే సాంత్వన పొందేదట. 2020 నుంచి స్వేచ్ఛ పూర్ణచందర్ కు దగ్గరయిందట.. 2022 నుంచి స్వేచ్ఛ కూతురు అరణ్య బాధ్యతను పూర్ణచందర్ తీసుకున్నాడట. ఆమెకు కావలసిన అన్ని సౌకర్యాలను పూర్ణచందర్ కల్పించాడట. పూర్ణ చూపిస్తున్న ప్రేమకు ముగ్దురాలైన స్వేచ్ఛ తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. అంతేకాదు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆమె పేరు పక్కన తన పేరు రాసుకుందట..
స్వేచ్ఛ కూతురు ఓణీ ఫంక్షన్ కు దాదాపు 5 లక్షల దాకా ఖర్చయిందట. ఆ ఖర్చు మొత్తం పూర్ణచందర్ భరించాడట. స్వేచ్ఛకు చిన్నచిన్న ఆనందాలు పూర్ణచందర్ ఇచ్చాడట. అంతేకాదు స్వేచ్ఛ మరణంతో పూర్ణకు ఎటువంటి సంబంధం లేదట. స్వేచ్ఛ మరణం విషయంలో ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా.. బంధువులు చెబుతున్నట్టుగా తాను ఎటువంటి తప్పూ చేయలేదని పూర్ణచందర్ చెబుతున్నాడు.. సరిగ్గా పోలీసులు అరెస్టు చేయడానికి ముందు పూర్ణచందర్ పేరుతో ఈ లెటర్స్ బయటికి రావడం కలకలం రేపుతోంది.