CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్.. ఇలాంటివి సరికాదంటూ ఆగ్రహం.. ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఓటుకు నోటు కేసు నడుస్తున్న నేపథ్యంలో న్యాయస్థానాలకు రాజకీయాలు ఆపాదించొద్దని ఇరు వర్గాలకు సూచనలు చేసింది.

Written By: Neelambaram, Updated On : August 29, 2024 5:15 pm

CM Revanth Reddy(4)

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం రేవంత్ కు సంబంధించిన ఓటుకు నోటు కేసు నడుస్తున్నది. ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తి దృష్టికి వెళ్లాయి. దీంతో సుప్రీం కోర్టుకు రాజకీయాలు ఆపాదించాలని చూడొద్దని మండిపడింది. ప్రస్తుతం ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్య ప్రదేశ్ కు బదిలీ చేయాలని ప్రతివాదులు పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థపై విశ్వాసం లేనివారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు పరిగణించాల్సి వస్తుందని జస్టిస్ గవాయి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదులు వాదిస్తూ ప్రస్తుతం నిందితుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ అయిన ఏసీబీ ఆయన వద్దే ఉన్నదన్నారు. ఈ కేసును ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీరుగార్చే అవకాశం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ధర్మాసనం స్పందిస్తూ.. మీరు చెప్పినట్లు కేసును బదిలీ చేస్తే న్యాయస్థానానికి కూడా రాజకీయాలు ఆపాదించినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి సరికాదని పేర్కొంది.

అయితే ఈ కేసు నడుస్తుండగా, కవిత బెయిల్ ఆంశం తెరపైకి వచ్చింది. కవిత బెయిల్ విషయంలో సుప్రీం తీర్పు పై సీఎం రేవంత్ రెడ్డి స్పందనను వారు ప్రస్తావించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఇలా సుప్రీం కోర్టు తీర్పులకు రాజకీయాలు ఆపాదించవచ్చునా అంటూ ప్రశ్నించింది. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మేమేమైన రాజకీయ పార్టీలను సంప్రదించి తీర్పులు ఇస్తున్నామా అంటూ మండిపడింది. ఇక ఓటుకు నోటు కేసు బదిలీకి సంబంధించి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ లభించింది. ఈ క్రమంలో బుధవారం ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీతో మిలాఖత్ వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ మాట్లాడారు. ఇదే అంశం సుప్రీం ధర్మాసనం దృష్టికి వెళ్లింది. ఇది సరికాదంటూ సీఎం రేవంత్ రెడ్డిని సున్నితంగా మందలించింది. అత్యున్నత న్యాయస్థానానికి రాజకీయాలు ఆపాదించడం ఏంటని ప్రశ్నించింది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలను వినవద్దని అనుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఇక ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎం గా ఉన్న నేపథ్యంలో ఈ కేసును వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా కోర్టులకు రాజకీయాలు ఆపాదిస్తారా అంటూ సుప్రీం ప్రతివాదులను మందలించింది. కోర్టుల్లో తీర్పులెలా ఇవ్వాలో కూడా మీరే చెబుతారా అంటూ పేర్కొంది. జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. అయితే నిందితుడు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయన వద్దే ఉన్న ఏసీబీ ఈ కేసును నీరుగార్చే అవకాశం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే పూర్తి వాదనలు వింటామని, ఈ కేసును ధర్మాసనం వాయిదా వేసింది. సోమవారం మరోసారి వాదనలు వింటామని చెప్పింది.