Offer Cars : బడ్జెట్ లో రావాలంటే కుదరదు. ఈ నేపథ్యంలో అలాంటి వాటి కోసం కాస్త డబ్బు ఎక్కువగా వెచ్చించాల్సిందే. అయితే ఇటువంటి కార్ల మీద ఒక్కోసారి డిస్కౌంట్లు ఇస్తుంటాయి కొన్ని కంపెనీలు. మరోవైపు పండుగల సీజన్లలో కొన్ని ఆఫర్లు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభమైంది. వచ్చే దీపావళికి కొత్త కారు కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో కార్లపై ఆఫర్లు కూడా ఇస్తుంటారు. అయితే అంతకంటే ముందే కారును ఊహించని లో బడ్జెట్ లో కారును కొనుగోలు చేయొచ్చు. అదెలాగంటే?
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఆసక్తికర ప్రకటన చేశారు. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పాత వాహనాలను స్క్రాప్ కింద వేయాలని అన్నారు. ఇలా చేసి ఆ సర్టిఫికెట్ తీసుకొస్తే కొత్త కారు కొనేవారికి డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి వారికి 1.5 నుంచి 3.5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంటే ఒక్కో కారుపై రూ. 30 వేల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాత కార్లు ఉన్న వారు వాటి స్థానంలో కొత్త కార్లు తీసుకోవడం వల్ ఉపయోగాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం పాత వాహనాల స్థానంలో కొత్త కార్లు తీసుకునే ప్రయత్నం చేస్తోంది.
అయితే ఎలాగూ దీపావళికి కార్లకు డిమాండ్ ఉంటుంది. ఈ తరుణంలో కొన్ని కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ తరుణంలో పాత మోడల్ కావాలనుకునవారికి ఆ కారు దొరికే అవకాశం ఉండదు. అందువల్ల దీపావళికి ముందే ఈ కారు కొనుగోలు చేస్తే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆలోపు కారు కొనేవారికి డిస్కౌంట్ తో పాటు కావాలనుకున్న వాహనం దొరికే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం డిమాండ్ లేనందున కొన్ని కార్ల ధరలు లో బడ్జెట్ లో లభించే అవకాశం ఉండనుంది.
ఇక పాత కార్ల స్థానంలో కొత్త కార్లు కొనేలా ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేయనుంది. దీంతో ఇప్పటికే స్క్రాప్ కు రెడీగా ఉన్న వాహనాలను తీసేయాలని చూస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు పండుగలతో సంబంధం లేకుండా ఇప్పటికే కొన్ని ఆఫర్లు ప్రకటించాయి. ఆ ఆపర్లతో పాటు స్క్రాప్ డిస్కౌంట్ కూడా పొందడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆటోమేటిక్ కార్లు అమ్మకానికి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు మాన్యువల్ గేర్ బాక్స్ కార్లనే వాడారు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కావాలని కోరుకునేవారు పాత కారు స్థానంలో కొత్తది తీసుకోవచ్చు.
కొన్ని కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు వివిధ రకాల కార్లపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతుండడంతో ఈవీల పై భారీ డిస్కౌంట్ ప్రకటించనున్నారు. అందువల్ల పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలు కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం అని అంటున్నారు.