https://oktelugu.com/

కరోనా : మన చదువుల క్యాలెండర్ కు దెబ్బ

తెలంగాణలో సదువులు సక్కబెట్టే గడియ వచ్చింది. వచ్చే నెల నుంచి కాలేజీలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు క్యాలెండర్ ను ప్రకటించింది. కరోనా దెబ్బకు కుదేలైన చదువులను చక్కబెట్టే ప్రయత్నం మొదలైంది.  అటు అకాడమిక్‌ ఇయర్‌‌కు, ఇటు సెలవులకూ గండి కొట్టింది. 2020–21కి గాను కొత్త ఇంటర్మీడియెట్‌ ఇయర్‌‌ క్యాలెండర్‌‌ను తెలంగాణ రాష్ట్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దసరాకు మూడు రోజులు, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 01:14 PM IST
    Follow us on


    తెలంగాణలో సదువులు సక్కబెట్టే గడియ వచ్చింది. వచ్చే నెల నుంచి కాలేజీలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు క్యాలెండర్ ను ప్రకటించింది. కరోనా దెబ్బకు కుదేలైన చదువులను చక్కబెట్టే ప్రయత్నం మొదలైంది.  అటు అకాడమిక్‌ ఇయర్‌‌కు, ఇటు సెలవులకూ గండి కొట్టింది. 2020–21కి గాను కొత్త ఇంటర్మీడియెట్‌ ఇయర్‌‌ క్యాలెండర్‌‌ను తెలంగాణ రాష్ట్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దసరాకు మూడు రోజులు, సంక్రాంతికి రెండు రోజులే సెలవులు ఇచ్చింది.

    Also Read: మోడీతో ఫైట్.. కేసీఆర్ నెగ్గుతారా?

    సాధారణ అకాడమిక్‌ ఇయర్‌‌తో పోలిస్తే కాలేజీలు ఈసారి సుమారు 50 రోజులు తక్కువగా తెరుచుకోనున్నాయి. 228 రోజులు మాత్రమే కాలేజీలు పనిచేస్తున్నాయి. ఇందులో పబ్లిక్‌ హాలిడేస్‌, ఆదివారాలు కలిపి 46 పోనూ 182 రోజులు మాత్రమే క్లాస్‌ జరుగనున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పటికే సుమారు మూడు నెలల కాలం గడిచిపోయింది.

    2019–20 విద్యాసంవత్సరంలో 232 రోజులు ఉండగా.. దసరాకు 12 రోజులు, సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు ఇచ్చారు. ఈసారి ఆదివారంతో కలిపి దసరాకు మూడు రోజులే ఇస్తున్నారు. డిజిటల్‌ తరగతులు ప్రారంభమైన సెప్టెంబర్‌‌ 1 నుంచే అకాడమిక్‌ ఇయర్‌‌ ప్రారంభమైనట్లు బోర్డు అందులో పేర్కొంది. 2021 ఫిబ్రవరి నెలలో ఫ్రీ ఫైనల్‌, మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఇంటర్‌‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అకాడమిక్‌ ఇయర్‌‌ లాస్ట్‌ వర్కింగ్‌ డే ఏప్రిల్‌ 16 కాగా.. తిరిగి జూలై 1 నుంచి 2021–22 అకాడమిక్‌ ఇయర్‌‌ స్టార్ట్‌ అవుతుంది.

    Also Read: అబ్బా.. ఏం చెప్తిరి.. అన్యాయాలపై సరెండరేనా?

    అయితే అకాడమిక్‌ ఇయర్‌‌ ప్రారంభించిన ఇంటర్‌‌ బోర్డు కొత్త ప్రవేశాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఎప్పటి నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తారనే అంశంపై ఏమీ చెప్పలేదు. సెప్టెంబర్‌‌ 1 నుంచి ఇంటర్‌‌ సెకండియర్ స్టూడెంట్స్‌కు మాత్రమే క్లాసెస్‌ చెబుతున్నారు. కానీ.. ఫస్టియర్‌‌ ప్రవేశాలు ఇంకా ప్రారంభించలేదు. దీంతో వారు విద్యాసంవత్సరం నష్టపోతూనే ఉన్నారు.