https://oktelugu.com/

బాహుబలిని మించి  ప్రభాస్ ‘ఆదిపురుష్’ మాయజాలం..  

‘బాహుబలి’ సిరీసుల తర్వాత యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ వరల్డ్ వర్డ్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ కలెక్షన్ల వర్షం సునామీ సృష్టించింది. అమరేంద్ర బహుబలిగా ప్రభాస్ చూపిన అద్భుత నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. Also Read: ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ బ్యూటీ శ్రియ..! ప్రభాస్ ప్రస్తుతం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 01:21 PM IST

    aadhipurush

    Follow us on


    ‘బాహుబలి’ సిరీసుల తర్వాత యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ వరల్డ్ వర్డ్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ కలెక్షన్ల వర్షం సునామీ సృష్టించింది. అమరేంద్ర బహుబలిగా ప్రభాస్ చూపిన అద్భుత నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు.

    Also Read: ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ బ్యూటీ శ్రియ..!

    ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. ఇటీవలే ‘సాహో’గా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగులో ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ప్రభాస్ కు నార్త్ తో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

    తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. దీంతోపాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ మూవీ చేస్తున్నాడు. వైజయంతీ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తోంది. భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ నటిస్తుంది.

    వీటితోపాటు దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’లో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా కన్పించబోతుండటం విశేషం. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్లో టీ సీరిస్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఏమాత్రం ఖర్చుకు వెనుకడటం లేదని తెలుస్తోంది.

    Also Read: గంగవ్వ సేఫ్.. ఎలిమినేట్ అయ్యేది వీళ్లే?

    ‘ఆదిపురుష్’ మూవీకి గ్రాఫిక్స్ మాయాజలం ప్రధాన ఆకర్షణ కానుందట. ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం. కనివినీ ఎరుగని రీతిలో ‘ఆదిపురుష్’లో గ్రాఫిక్స్ ఉండనుందని ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.