TGRTC Strike Notice: సమ్మే, సమ్మే, సమ్మే.. మరోసారి సమ్మే సైరన్ మోగనుంది. గతంలో ఆర్టీసీ కార్మీకులు సమ్మే చేయడం వల్ల ప్రయాణీకులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. ప్రతి రోజు స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే వారు ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేశారు. అయితే ఇప్పుడు మరో సారి సమ్మే సైరన్ మోగనుంది. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మే నోటీసులు ఇచ్చారట. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు పైనా స్పష్టమైన డిమాండ్లు చేశారు కార్మిక సంఘాలు.
ప్రధాన డిమాండ్లు ఏంటంటే?
1) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం 2) 21వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయడం, 3) సీసీఎస్, పీఎఫ్ బకాయిలు రూ.2,700 కోట్ల చెల్లించడం, 4) పీఆర్‌సీ అమలు చేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి. అంతేకాదు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం లేకుండా చట్టాలు రూపకల్పన చేయడం వంటివి కూడా ఉన్నాయి.
అయితే బస్‌భవన్ వద్ద పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు చేరారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉన్నారు. దీంతో కార్మిక సంఘాలు ఈడీ మునిశేఖర్‌కు నోటీసులు అందజేశారు. ఈ సమ్మె నోటీసులు అందుకున్న తర్వాత ప్రభుత్వం రెండు రోజుల్లోనే స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కొందరిలో ప్రభుత్వం స్పందించకపోవచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయట. ఇక ఇలాంటి సమయంలో అంటే ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించింది జేఏసీ. ఇక ఈ విషయం మీద కార్మికులంతా సమ్మెకు సంఘీభావం తెలుపుతారా లేదా అనే విషయం మీద ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ బస్సుల ఆవిర్భావంతో డ్రైవర్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని.. ఉన్న డ్రైవర్లను కొనసాగించాలనే డిమాండ్‌ను కూడా కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఆర్టీసీ జేఏసీ యాజమాన్యానికి తమ డిమాండ్లు వివరించేలా స్పష్టమైన నోటీసు ఇచ్చారు. సమ్మె చేసే ఆలోచనలో ఉన్న కార్మిక సంఘాల నేతలు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఈ సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు పూర్తిగా మద్దతు ఇస్తారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే వీరు గనుక ఈ సమ్మేకు మద్దతు ఇస్తే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు బంద్ అవుతాయి. అంతేకాదు ఉచిత బస్సు పథకం కూడా వారి సమ్మె కారణంగా ఆగిపోతుంది.