మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. దేశంలోని ప్రజలంతా 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2021 సంవత్సరానికి వెల్ కం చెప్పబోతున్నారు. అయితే ఒక కుటుంబాన్ని మాత్రం 2020 సంవత్సరంలోని చివరి రోజులు దుఃఖంలో ముంచేశాయి. కోతి వల్ల హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన ఒక యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడు ఊహించని విధంగా చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
Also Read: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్… పరీక్షలు ఎప్పుడంటే..?
పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్నిరోజుల నుంచి కూకట్ పల్లి ఏరియాలోని జయనగర్ లో కోతుల బెడద ఎక్కువైంది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న 30 సంవత్సరాల వయస్సు గల లోకేష్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల గత కొంతకాలం నుంచి ఇంటి నుంచే పని చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సెకండ్ ఫ్లోర్ లో ఉన్న లోకేష్ ఇంట్లోకి కోతులు వచ్చాయి. లోకేష్ ఇనుప రాడ్ తో కోతిని బెదిరిస్తూ బయటకు వచ్చాడు.
Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. సులభంగా టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్..?
లోకేశ్ కోతిని కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఇనుప రాడ్డు విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ తీగల వల్ల షాక్ కొట్టడంతో లోకేష్ షాక్ కు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. దీంతో జయనగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
గాలి రావడం కోసం అతను కిటికీ తలుపులను తెరిచి ఉండగా ఆ తలుపుల నుంచి కోతి ఇంట్లోకి ప్రవేశించడం గమనార్హం. కోతి పరోక్షంగా యువకుడు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.