కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఈ ఏడాది విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్లు విడుదలవుతున్నాయి. ఈరోజు కేంద్రం నుంచి సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు మే 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 10, ఇంటర్ విద్యార్థులకు మార్చి నెల మొదటివారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి నెలలోగా కేంద్రం కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని భావిస్తోంది. త్వరలో పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ ను కేంద్రం విడుదల చేయనుంది.
Also Read: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..!
మంత్రి రమేష్ ఈరోజు ట్విట్టర్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సీబీఎస్ఈ విద్యార్థులకు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేవి. అయితే వచ్చే ఏడాది మూడు నెలలు ఆలస్యంగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే కొత్తరకం కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
మరోవైపు ప్రజలను కరోనా 2.0 భయం వెంటాడుతోంది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్న నేపథ్యంలో దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగా కొత్త స్ట్రెయిన్ కలవరం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి రావడం, ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.