టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కన్నుమూశారు. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయప్రకాష్ సహా ఎంతో మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు కన్నుమూయగా.. తాజాగా నర్సింగ్ యాదవ్ కూడా వదిలిపోవడం టాలీవుడ్ ప్రముఖులను శోకసంద్రంలో ముంచెత్తింది.
Also Read: మా పిల్లల్ని ఆకతాయిలుగా పెంచం – విరుష్క
తాజాగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన విలన్, కమెడియన్, సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ తో కన్నుమూసినట్టు తెలిసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోధ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తాజాగా మరణించారు.
నర్సింగ్ యాదవ్ చివరగా.. చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు. 400కు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్‌ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్.
Also Read: నిహారికకు కరోనాపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు
అప్పట్లోనే నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఏప్రిల్ లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో కొద్దిరోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి చనిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్