Teenmar Mallanna: తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో కొనసాగుతోంది. ఎస్సై నుంచి ఐపీఎస్ వరకూ ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. మొదట ప్రణీత్‌రావు అరెస్టుకాగా, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది పేర్లు బయటకు వచ్చాయి. మరో ఐదుగురు అరెస్ట్ కూడా అయ్యారు.
సినీ స్టార్ల ఫోన్టు కూడా..
తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల నుంచి సినిమా స్టార్ల వరకు వెళ్లింది. దీంతో టాలీవుడ్‌లోనూ ఈ వ్యవహారం కలకలం సృష్టిసో‍్తంది. పలువురు హీరో హీరోయిన్ల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిన విషయం బయటకు వచ్చింది. దీంతో సినీ ప్రముఖుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్‌రావు విచారణలో రోజుకో సంచలన విషయాలు బయటకు చెబుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖకు చెందిన పలువురి పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించారు. తాజాగా సినిమా వాళ్ల పేర్లు బయట పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో వైరల్..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఫోన్ ట్యాపింగే కారణమని ప్రచారం కావడం సంచలనంగా మారింది. అయితే దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో మరింత ఆసక్తి చేపుతోంది.
తీన్మార్ మల్లన్న స్పందన..
ఇదిలా ఉండగా కవిత అరెస్టు నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు తీన్మార్ మల్లన‍్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమని పేర్కొన్నారు. అప్పటి అధికార పార్టీ కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యంతోనే వారు విడిపోయారని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుని దానిపై వీడియో చేస్తానని చెప్పడం సంచలనంగా మారింది. అయితే దీనిలో వాస్తవం ఎంత ఉంది అనేది ఆసక్తి చేబుతోంది.