CM Revanth Reddy: లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అనేక విశ్లేషనలు వినిపించాయి. మూడోసారి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధాన మంత్రి కాగానే బోటా బోటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పక నజర్ పెడతారనే చర్చ సాగింది. కానీ,ఇప్పుడు అదంతా.. అసాధ్యమని తేలిపోయింది. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ ముట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇందుకు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా రెండే కారణాలు చెబుతున్నారు. 2019లో బిజెపికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటి ఆ పార్టీ 303 సీట్లు సాధించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఐదేళ్ల కాలంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు,విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న గవర్నమెంట్లను నరేంద్ర మోడీ సర్కార్ కుప్పకూల్చేసింది. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలైన ఈడి,సిబిఐ,ఐటిలను విచ్చలవిడిగా వాడి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టి జైల్లో వేయించింది.
ఇక మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోడీ ఈసారి తెలంగాణలొని కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవచ్చని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. కానీ, మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ సర్కార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు అయింది. కేంద్రంలో బిజెపి 240 సీట్లనే సాధించడం, ఆంధ్రప్రదేశ్లో రేవంత్ గురువు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండడంతో.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్యానికి ప్రమాద ముప్పు తప్పిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ రెండు కారణాలవల్లే ప్రస్తుతం టీ-కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్ జోన్ లో ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కేంద్రంలో బిజెపికి అబ్సల్యూట్ మెజార్టీ ఉండడంతో.. నియంత పరమైన నిర్ణయాలు తీసుకుంది. కానీ,ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో అలాంటి నిర్ణయాలకు ఆస్కారం లేదు. దేశంలో పరిపాలనపరంగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా..తన మిత్రపక్షాలను సంప్రదించాల్సిన పరిస్థితి కమలనాథులది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టిడిపి, జేడీయూలతో చర్చించకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం లేదు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో..కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే పనిని బిజెపి నాయకత్వం పెట్టుకోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Revanth sarkar is safe the reasons are twofold
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com