Homeక్రీడలుPAK Vs USA T20 World Cup: ఇదీ భారత ఆటగాళ్ల దమ్ము.. సూపర్ ఓవర్...

PAK Vs USA T20 World Cup: ఇదీ భారత ఆటగాళ్ల దమ్ము.. సూపర్ ఓవర్ ఇలా ఆడాలి.. పాక్ ను ఏకిపడేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్

PAK Vs USA T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓడిపోయింది.. టి20 క్రికెట్ లో పాకిస్తాన్ ఆరో ర్యాంకులో కొనసాగుతోంది.. అమెరికా 18వ స్థానంలో కొనసాగుతోంది. అమెరికా జట్టు తో పోల్చితే పాకిస్తాన్ చాలా బలమైంది. కానీ, ఆ స్థాయిలో ఆ జట్టు ఆట తీరు ప్రదర్శించలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేయలేకపోయింది, మెరుగ్గా బౌలింగ్ వెయ్యలేకపోయింది. గెలవాల్సిన దశలో దారుణంగా బౌలింగ్ వేసి పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన అమెరికా కూడా 159 పరుగులు చేసింది.. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్లో అమెరికా ముందుగా బ్యాటింగ్ చేసి, 18 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కేవలం 13 పరుగులు చేసి.. ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది.

సూపర్ ఓవర్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు భారతీయ అభిమానులు పాకిస్తాన్ జట్టును ఏకిపడేస్తున్నారు.. ఈ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ జట్టు తలపడిన ఒక మ్యాచ్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 2020 జనవరిలో భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటించింది. ఇందులో భాగంగా జనవరి 29న హమిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ లో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై గా మారింది. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది . సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 17 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు 20 పరుగులు చేసి విజయం సాధించింది.

సూపర్ ఓవర్ లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ అలరించాడు. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం అమెరికా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో.. సూపర్ ఓవర్ ఇలా ఆడాలంటూ భారత అభిమానులు పాకిస్తాన్ క్రీడాకారులకు సూచిస్తున్నారు. నాడు న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సూపర్ ఓవర్లో భారత్ ఆడిన తీరును.. సాధించిన విజయాన్ని గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు చురకలంటిస్తున్నారు…” ఇదీ మా భారత క్రీడాకారుల ఆట తీరు.. సూపర్ ఓవర్ లో ఇలా ఆడాలి. ఇలా ఆడితేనే విజయాలు లభిస్తాయి. అలాకాకుండా చేతులెత్తేస్తే పరాజయాలే మిగులుతాయంటూ” నెటిజన్లు పాకిస్తాన్ క్రీడాకారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం నాటి మ్యాచ్ తాలూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular