Revanth Reddy : రెఫరెండం ఛాలెంజ్‌లో ఓడిన రేవంత్‌.. అలా కవర్‌ చేశారు..!

Revanth Reddy : బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కుమ్మక్కు అయినట్లే అని పేర్కొంటున్నారు. తమ కుమ్మకు, వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 5, 2024 9:28 pm

CM Revanth Reddy

Follow us on

Revanth Reddy : తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం… కొంత మందికి రూ.500లకే గ్యాస్‌.. కొందరికి గృహజ్యోతి పథకంలో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేస్తున్నామని లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీలు నెరవేర్చామని ప్రకటించారు.

రెఫరెండమ్‌గా చెప్పుకుని..
హామీలు అమలు చేస్తున్నామని, తమది ప్రజాపాలన అని, తమ పాలనకు తెలంగాణ సమాజా మద్దతు ఇస్తోందిన లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ప్రకటించారు. తెలంగాణలో కచ్చితంగా డబుల్‌ డిజిట్‌.. 14కు తక్కువ కాకుండా లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అని ప్రకటించారు.

అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం..
తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా, సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల బాధ్యతను కూడా భుజానికి ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్‌ చేస్తామనే ధీమాతో దూకుడుగా వ్యవహరించారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పదేళ్ల బీజేపీ పాలనపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి 14 స్థానాల్లో గెలుస్తామని ప్రకటించారు. ఈమేరకు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను.. 12 స్థానాల్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొన్నారు. సభలకు వచ్చిన జనం చూసి సీఎం రేవంత్‌రెడ్డిలో నమ్మకం మరింత పెరిగింది.

రిజల్ట్‌ ఇలా..
ఎన్నికల్లో కచ్చితంగా డబుల్‌ డిజిట్‌ స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉన్న రేవంత్‌కు పోలింగ్‌ ముగిసిన తర్వాత వాస్తవ పరిస్థితి అర్థమైంది. డబుల్‌ డిజిట్‌ నుంచి 9 స్థానాలకు దిగివచ్చారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో విఫలం అయ్యామని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. 9 సీట్లు అనుకుంటే.. ఒకస్థానం తగ్గి 8కి పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు బీజేపీ కూడా అధికార కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు గెలిచింది. దీంతో రేవంత్‌ ఛాలెంజ్‌లో ఫెయిల్‌ అయ్యార్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.

కవర్‌ చేసుకునే ప్రయత్నంలో రేవంత్‌..
లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమ్‌ అని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఫలితాల తర్వాత దానిని కవర్‌ చేసుకునే పని మొదలు పెట్టారు. సీట్లు తగ్గినందున.. రెఫరెండంపై వెనక్కి పోతే… ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని గుర్తించి.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న రాగం అందుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ చేతులు ఎత్తేసిందని, బీఆర్‌ఎస్‌ ఓట్లు కూడా బీజేపీకి వేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సూచించారని అంటున్నారు. ఈమేరకు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వెల్లడించారు. కమ్మక్కు రాజకీయాలతోనే తమకు సీట్లు తగ్గాయని పేర్కొన్నారు.

దీంతో రెఫరెండంలో ఫెయిల్‌ అయిన రేవంత్‌.. దానిని కవల్‌ చేసుకునేందుకు బీజే పీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రేవంత్‌కు దమ్ముంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేయాలని సవాల్‌ చేస్తున్నారు. అలా చేయకుంటే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కుమ్మక్కు అయినట్లే అని పేర్కొంటున్నారు. తమ కుమ్మకు, వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.