Revanth Reddy Shocking Comments: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కవిత కొన్నిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు.. వ్యవహరిస్తున్న శైలి.. చినికి చినికి తుఫాన్‌గా మారింది. చివరకు కవితను బహిష్కరించే స్థాయికి చేరింది. ఇక బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత కవిత హరీశ్‌రావు, సంతోష్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి నేతల వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించారు. ‘మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి.. మీ కుటుంబ కలహాల్లోకి మమ్మల్ని లాగొద్దు‘ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ ఆధిపత్య పోరాటాలను ప్రజలపై రుద్దడంపై అసహనం వ్యక్తం చేశారు.
మీ గొడవలోకి లాగొద్దు..
‘మీలో మీరు కొట్టుకోండి.. మీ కుటుంబ కలహాల్లోకి మమ్మల్ని లాగొద్దు’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చెత్త నాయకులైన హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక తానెందుకు ఉంటానని ప్రశ్నించారు. తాను తెలంగాణను ముందు ఉండి నడిపిస్తున్నానని తెలిపారు. కవిత, కేటీఆర్, హరీశ్‌రావు పంపకాల్లో తేడా కారణంగానే గొడవలు పడుతున్నారని, చివరకు వీధిన పడ్డారని ఎద్దేవా చేశారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు అని కవిత, కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి పేర్కొన్నారు. కవితకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం, ఆమె స్వతంత్ర కార్యక్రమాలకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలెన్నో..
ఇదిలా ఉంటే.. తాజాగా కవిత ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నేరుగా కొన్ని ప్రశ్నలు వేశారు. 103 రోజులుగా ఎందుకు మాట్లాడడం లేదు. కుట్ర జరుగుతుందని చెప్పినా ఎందుకు స్పందించడం లేదు. కేసీఆర్‌పై సీబీఐ వేసినప్పుడు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టలేదు. హరీశ్‌రావు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు సస్పెండ్ చేయరు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడినట్లు తెలిసినా ఎందుకు కొనసాగించారు. కేటీఆర్‌తోపాటు పలు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు హరీశ్‌రావు పనిచేసినా చర్యలు ఎందుకు లేవు ఇలా అనే ప్రశ్నలు వేశారు. వీటికి ఇప్పుడు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి.
బీఆర్‌ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కవితకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
చేసిన పాపాలు ఎక్కడికీ పోవూ
ఆనాడు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారు
ఈరోజు దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో గొడవలు వచ్చి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు
నేను ఆ చెత్త గాళ్ల వెనక… pic.twitter.com/JmTyxFrBdB
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025