Astrology predictions after lunar eclipse: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో వీటి ఫలితాలు విశేషంగా ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7న రెండో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది రాహు గ్రస్త చంద్రగ్రహణం కావడంతో పాటు భారత్లో స్పష్టంగా కనిపించనుంది. దీంతో ఇక్కడ సూత కాలం వర్తించే అవకాశం ఉంటుందని ఇప్పటికే చాలామంది పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని నిబంధనలు పాటించాలని అంటున్నారు. అయితే సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ధనయోగం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఇప్పటినుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందడంతో సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కలుస్తాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
వృషభ రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత శుక్ర బలం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరికి సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇండియాలో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కలుస్తాయి. కొన్ని గ్రహాల అనుకూలంగా మారడంతో కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు రావడంతో సంతృప్తిగా ఉంటారు. కొందరికి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
తులా రాశి వారు సెప్టెంబర్ 7 నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు కొన్ని పనుల కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. అర్హులైన వారికి వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలని అనుకునే వారికి అనువైన సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలతో ఉల్లాసంగా ఉంటారు.
మీన రాశి వారికి తల్లిదండ్రుల సహకారం ఎక్కువగా ఉండడంతో వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. సోదరుల మధ్య సంయమనం ఉండడంతో వ్యాపారులు లాభాలు చెందుతారు. ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. వీరికి గురు బలం ఎక్కువగా ఉండడంతో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించడం ఖాయం.
మకర రాశి ఉద్యోగులు చేసే ప్రయత్నాలు పరిస్తాయి. వృత్తి రీత్యా ప్రయాణాలు చేసేవారు లాభపడతారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో అవకాశం ఏర్పడుతుంది. అయితే వీరికి ఆకస్మిక ధన లాభం పెరిగినా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కొన్ని వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి వారికి ఇకనుంచి లాభాల పంట పండినట్లే. గతంలో వ్యాపారం ప్రారంభించిన వారికి ఇకనుంచి లాభాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది. ధన లాభం పెరుగుతుంది.