https://oktelugu.com/

Revanth Reddy : అందరికీ షాకిస్తూ రేవంత్‌ చేతుల్లోకి కాంగ్రెస్‌..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీని ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మధు యాష్కీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించగా, కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, కమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ ను నియమించింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2023 / 03:12 PM IST
    Follow us on

    Revanth Reddy : యుద్ధానికి వెళ్లాలంటే సైన్యం బలంగా ఉండాలి.. అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి. వ్యూహాలు రూపొందించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు కదలాలి. తెలంగాణ కాగ్రెస్‌ ఈమేరకు అడుగులు వేస్తోంది. మరో ఐదు నెలల్లో జరిగే ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే వ్యూహాలు, ప్రణాళిక బాగానే ఉన్నా.. అధిష్టానం తీరు చూస్తుంటే.. పార్టీని మొత్తాన్ని రేవంత్‌ చేతుల్లో పెడుతున్నట్లు అనిపిస్తోంది. టీపీసీసీకి రేవంత్‌ను వన్‌మెన్‌ ఆర్మీని చేస్తోంది. ఇప్పటికే టీపీసీసీ ఇవ్వడంపై పార్టీలో సీనియర్లు చాన్నాళ్లు అలకబూనారు. అసలైన కాంగ్రెస్‌ వాదులు, వలస వాదులు అంటూ గ్రూపులుగా విడిపోయారు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. చాన్నాళ్ల తర్వాత టీకాగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీని ప్రకటించిన ఏఐసీసీ ఆ కమిటీ సారథిగా మళ్లీ రేవంత్‌నే నియమించింది.

    మొన్న 37 మందితో ప్రచార కమిటీ..
    తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీని ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మధు యాష్కీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించగా, కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, కమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ ను నియమించింది. మొత్తం 37 మందితో ప్రచార కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది.

    నిన్న 26 మందితో ఎన్నికల కమిటీ..
    ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా రేవంత్‌ రెడ్డికి పట్టం కట్టింది. మొత్తం 26 మందితో కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ అందులో సీనియర్‌ నాయకులకు అవకాశం కల్పించింది. సభ్యులుగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మహేష్‌ కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, వి హనుమంతరావు, మహమ్మద్‌ అజారుద్దీన్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ కు స్థానం కల్పించింది. ప్రచార కమిటీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కిగౌడ్, చల్ల వంశీచందర్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సంపత్‌ కుమార్, పోరిక బలరాంనాయక్, పొదెం వీరయ్య, సీతక్క, మహమ్మద్‌ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ సాగర్‌ రావు, ఎన్‌.సునీత రావులకు కూడా ఎన్నికల కమిటీలో స్థానం కల్పించింది. ఎన్నికల కమిటీ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, సేవాదళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్స్‌కు అవకాశం కల్పించింది ఏఐసీసీ.

    ఎన్నికలకు వడివడిగా..
    2018లో కాంగ్రెస్‌ ఎన్నికలకు సమాయత్తం కాకముందే సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లారు. ఫలితంగా కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అలాంటి పొరపాటు జరుగకుండా రాబోయే ఎన్నికల వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక్కొక్క పని చేసుకుంటూ పోతోంది. వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చూపించడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. గతానికి భిన్నంగా కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఐక్యత రాగాన్ని ఆలపిస్తూ తెలంగాణలో ముందుకు సాగుతుండడం కాంగ్రెస్‌ పార్టీపై అందరి దృష్టి పడేలా చేస్తుంది.