Mahaveerudu Movie Collection : తమిళస్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మావీరన్’ తెలుగు లో ‘మహావీరుడు’ అనే పేరుతో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు మొదటి ఆట నుండే పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో లేవు. అందుకు కారణం చిత్ర యూనిట్ నిర్లక్ష్యమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అసలు ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని గాలికి వదిలేశారని, లేకుంటే ఈ సినిమా తెలుగు లో మంచి కమర్షియల్ హిట్ అయ్యేదని అంటున్నాడు ట్రేడ్ పండితులు. అసలు సినిమా విడుదల అయ్యింది అనే విషయం కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియదని, నిర్మాతల నిర్లక్ష్యం వల్ల మినిమమ్ 10 కోట్ల రూపాయిలు ఈ సినిమా నష్టపోయి ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం లో రవితేజ వాయిస్ ఓవర్ ఉంటుంది, కనీసం దీనిని కూడా ప్రమోట్ చేసుకోలేకపోయింది మూవీ టీం.
ఇంత చెత్త ప్రొమోషన్స్ చేసిన ఈ సినిమాని కనీసం తక్కువ రేట్స్ కి అమ్మారా అంటే అదీ లేదు, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలి అంటే కచ్చితంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించాలి. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా వారం రోజులకు గాను ఈ సినిమా కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రం రాబట్టింది. ఇది డీసెంట్ వసూళ్లే, కాకపోతే ఎక్కువ రేట్స్ కి అమ్మడం వల్ల చివరికి ఫలితం డిజాస్టర్ గానే మిగిలింది. దానికి తోడు బేబీ మూవీ సెన్సేషన్ సృష్టించడం వల్ల దాని ప్రభావం కూడా ఈ చిత్రం పై బలంగానే పడింది.
ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించాలి. ఎంత ఆడినా ఈ సినిమా ఈ వారమే ఆడాలి, ఎందుకంటే వచ్చే వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ విడుదల అవుతుంది. థియేటర్స్ మొత్తం దానికే వెళ్ళిపోతుంది, అక్కడితో ఈ సినిమా క్లోజ్ అనుకోవచ్చు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా మరో 50 లక్షల రూపాయిల షేర్ ని సాదిస్తుందని అంటున్నారు.