Telugu News » Latest News » Revanth reddy government prepares to hold panchayat elections in telangana
Local Body Elections : పంచాయతీ’కి సిద్దమైన రేవంత్ సర్కార్.. ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది. పాలకవర్గ పదవీకాలం ముగిసిన ఏడాది తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈమేరకు కసరత్తు చేస్తోంది.
Local Body Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రేవంత్‌రెడ్డి సర్కార్ సన్నద్ధం అవుతంది. ఈ ఏడాది ఫిబ్రరిలో రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. అయితే పాలకవర్గాలు లేనికారణంగా పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. ఈ తరుణంలో ఇంతకాలం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025, జనవరి 14న నోటిఫికేషన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మూడు ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరు పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఎంపీటీసీల సంఖ్య కూడా పెంచాలని ప్రభత్వం భావిస్తోంది. కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండాలని నిర్ణయించింది. డిసెంబర్ 9 నుంచి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఈమేరు సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికల్ల పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధనను కూడా ఎత్తివేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ సవరణ బిల్లును కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.
కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు..
తెలంగాణలో కుల గణన పూర్తికావొచ్చింది. ఆన్‌లైన్‌లో ఎంట్రీ జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసి పంచాయతీల రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈమేరకు అసెంబ్లీ ఎన్నికల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అంతకు ముందే రిజర్వేషన్ల సవరణకు కొత్త బీసీ కమిషన్‌ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత కమిషన్ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త కమిషన్ బిహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో చేపట్టిన కుల గణనపై అధ్యయనం చేస్తుంది. ఈమేరకు అవసరమైన నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలర సంఘం సిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్లతో కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
జనవరిలో నోటిఫికేషన్..
పంచాయతీ ఎన్నికలకు జనవరిలో నోటిషికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. జనవరి 14 నోటిఫకేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి నాటికి 12,769 పంచాయతీల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. అప్పటిలోగా రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. ఆసరా పింఛన్లు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు.