https://oktelugu.com/

CM Revanth Reddy: జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్

ఏపీలో జగన్ పాలనా తీరు, వైసిపి వైఖరిపై రేవంత్ స్పష్టంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు వైఎస్ జగన్ తనకు ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : January 7, 2024 11:35 am
CM Revanth Reddy

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ కెసిఆర్ కు స్నేహితుడయ్యాడు. చంద్రబాబుకు జగన్ ప్రత్యర్థి కావడం, కెసిఆర్ తో చంద్రబాబుకు వైరుధ్యం ఉండడం వీరిద్దరి స్నేహం కొనసాగింది. ఇప్పుడు కెసిఆర్ తెలంగాణలో అధికారానికి దూరమయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ తనకు ప్రత్యర్థి అని, తన శత్రువు కెసిఆర్ కు మిత్రుడు కావడంతో.. తాను శత్రువుగా పరిగణిస్తానని రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం జగన్ వ్యతిరేక మీడియా కావడంతో ఏపీకి సంబంధించి రాజకీయ ప్రశ్నలే రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి. ఏపీ సీఎం జగన్ పై రేవంత్ రెడ్డి నుంచి వీలైనన్ని ఎక్కువ సమాధానాలు రాబట్టారు రాధాకృష్ణ. జగన్ తన తొలి అస్త్రంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ సోదరి షర్మిల రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. అక్కడకు కొద్దిసేపటికే జగన్ టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడం విశేషం.

ఏపీలో జగన్ పాలనా తీరు, వైసిపి వైఖరిపై రేవంత్ స్పష్టంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు వైఎస్ జగన్ తనకు ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగిలిన రాష్ట్రాల సీఎంలు గౌరవపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతారని చెప్పుకొచ్చారు. కానీ అటువంటి సంస్కృతిని జగన్ పాటించలేదని రేవంత్ తెలిపారు. అదే సమయంలో షర్మిల ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె పిసిసి అధ్యక్షురాలు కావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీని జగన్ సర్వనాశనం చేశారని అర్థం వచ్చేలా రేవంత్ మాట్లాడారు. దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా బదులు చెబుతుందని కూడా తేల్చేశారు. జగన్ మమ్మల్ని శత్రువుగా చూశారని.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని భావించారని.. అందుకు తగ్గ సహకారం కూడా అందించారని రేవంత్ గుర్తు చేశారు. ఏపీలో వైసీపీలో టికెట్ దక్కని నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా తేల్చేశారు. తమ దగ్గర కూడా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బి ఫారాలు ఉన్నాయని గుర్తు చేశారు. తప్పకుండా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని రేవంత్ తేల్చేశారు. పరోక్షంగా వైసీపీ పతనం తప్పదని హెచ్చరించారు.