https://oktelugu.com/

CM Revanth Reddy: స్మితా సబర్వాల్ ను ఇమిటేట్ చేసిన రేవంత్ రెడ్డి.. వైరల్ వీడియో

గత ప్రభుత్వం అన్ని రంగాలలో అవినీతికి పాల్పడిందని.. ఇప్పటికే విద్యుత్ రంగానికి సంబంధించి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రాలు సమర్పించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 7, 2024 / 12:42 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికార పక్షం మీద తీవ్రమైన విమర్శలు చేసేవారు. చాలా దూకుడుగా వ్యవహరించేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట తీరులో చాలా మార్పు వచ్చింది. ఈమధ్య ఆయన పాల్గొన్న సమావేశాల్లో కూడా అది ప్రస్ఫుటంగా కనిపించింది. తాజాగా శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా హుందాగా అనిపించింది. రాధాకృష్ణ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం.. అది కూడా ఏమాత్రం ఆవేశపడకుండా చెప్పడం.. భారత రాష్ట్ర సమితి నాయకులను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే ఇదే క్రమంలో గత ప్రభుత్వ ఆధునిక సంబంధించి రాధాకృష్ణ ప్రశ్న సంధించడంతో రేవంత్ రెడ్డి చాలా ఓపికగా సమాధానం చెప్పారు.

    గత ప్రభుత్వం అన్ని రంగాలలో అవినీతికి పాల్పడిందని.. ఇప్పటికే విద్యుత్ రంగానికి సంబంధించి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రాలు సమర్పించింది. అయితే కీలకమైన నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా శ్వేత పత్రం సమర్పించలేదు. గతంలో ఈ శాఖకు రంజత్ కుమార్ శైనీ కార్యదర్శిగా ఉండేవారు. ఈయన హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం, కాలేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఒక ఇంజనీరింగ్ కంపెనీకి అనుకూలంగా ఈయన వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈయన కుమార్తె వివాహానికి ఆ కంపెనీ భారీగా ఆర్థిక సహాయం చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల రజత్ పదవీ విరమణ చేయడంతో నీటిపారుదల రంగానికి సంబంధించిన కేటాయింపులపై ప్రభుత్వం వద్ద ఒక లెక్క అంటూ లేకుండా ఉంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్లో పేర్కొన్నారు.

    కెసిఆర్ ప్రభుత్వం రజత్ తర్వాత స్మితా సబర్వాల్ కు ఆ బాధ్యత అప్పగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత.. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రభుత్వం జరిగిన కేటాయింపులపై వివరాలు కావాలని రేవంత్ రెడ్డి స్మిత సబర్వాల్ ఆదేశించారు. అయితే నాకు ఆ శాఖ కు సంబంధించి ఫుల్ ఛార్జ్ అప్పగించలేదని.. కేవలం ఇన్ ఛార్జ్ ను మాత్రమేనని అని రేవంత్ తో పేర్కొన్నారట. దీంతో ఆ శాఖకు సంబంధించిన కేటాయింపులు ఇంతవరకు అంతు పట్టడం లేదని రేవంత్ రాధాకృష్ణతో అన్నారు. ఇదే సమయంలో తాను నివేదిక అడిగినప్పుడు స్మిత సబర్వాల్ ఎలా చెప్పిందో.. అలానే రాధాకృష్ణతో పేర్కొన్నారు. ఒక దశలో స్మిత సబర్వాల్ ను రేవంత్ రెడ్డి ఇమిటేట్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాధాకృష్ణ నవ్వారు. కొందరు అధికారులు ఇవ్వక పోయినంత మాత్రాన ఆగేది లేదని.. కచ్చితంగా ఆ విషయాలను తవ్వితీస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలో నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా శ్వేత పత్రం విడుదల చేసే యోచనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు.